తమన్నా మేకప్ లేకపోతే ఇలా ఉంటుందా..?

తెలుగుతో పాటు తమిళ,కన్నడ మరియు హిందీ భాషల్లో కూడా ఈమె స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. ప్రస్తుతం తమన్నా చేతిలో ‘గుర్తుందా శీతాకాలం’, చిరంజీవి ‘భోళా శంకర్’ వంటి సినిమాలు ఉన్నాయని సమాచారం. హిందీలో కూడా మూడు సినిమా ల్లో నటిస్తోందట ఈ అమ్మడు. ఇదిలా ఉండగా.. తమన్నా రీసెంట్ గా ఓ వీడియోని విడుదల చేసింది. ఇందులో ఆమె యోగా చేసుకుంటూ కనిపిస్తుంది.

అనంతరం ఆమె యోగా గొప్పతనం గురించి చెప్పుకొచ్చింది. ఈషా యోగా కేంద్రాన్ని ప్రమోట్ చేస్తూ ఓ వీడియోను విడుదల చేసిన తమన్నా… శాంభవి క్రియ గురించి చాలా గొప్పగా చెప్పిందట.. అయితే ఈ వీడియోలో ఆమె మాటల కన్న కూడా ఆమె లుక్స్ బాగా వైరల్ అయ్యాయి. అలా అని తమన్నా గ్లామర్ గా కనిపించింది అని కాదు తమన్నా ఇందులో డిఫరెంట్ లుక్ లో కనిపించింది.

బహుశా మేకప్ లేకపోవడం వల్ల అనుకుంట.. ఆమె ఫేస్ ఎంతో తేడాగా కనిపించింది. ముడతలు కూడా కనిపిస్తున్నాయి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘ఫేస్ మొత్తం పాడైపోయింది.. జాగ్రత్త పడాలి అంటూ తమన్నా పై కొందరు నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడా ఈమె కరోనాకి గురైనప్పుడు లావయితే.. ఆ టైంలోనూ ఈమె పై ఇలానే ట్రోలింగ్ జరిగింది.

ఈ వీడియోలో తమన్నా లుక్ ఇప్పుడు బాగా వైరల్ గా మారింది.తమన్నా మేకప్ లేకుండా చూడటానికి కొద్దిగా ఇబ్బందిగానే ఉందంటున్నారట ఆమె ఫ్యాన్స్. మిగతా వారు కూడా మిల్కీ బ్యూటీ ఫేడ్ అవుట్ అయిపొయింది అంటున్నారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *