ఇండస్ట్రీలోకి వచ్చి తమన్నా ఎన్ని కోట్లు సంపాదించిందో తెలుసా..?

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల హవా కొంత కాలమే ఉంటుంది. హీరోయిన్లు 3 నుంచి 5 సంవత్సరాలు ఫీక్ స్టేజీలో ఉంటారు. ఆ తర్వాత సైడ్ క్యారక్టర్స్ చేస్తుంటారు. అందుకే ఫామ్ లో ఉన్నప్పుడే తూర్పారబడతారు. తమన్నా కూడా ఇలాగే చేసింది. వందల కోట్ల రూపాయలు వెనకెసినట్లు తెలుస్తోంది. అయితే అప్పుడెప్పుడో 2005 లో హీరోయిన్ గా సినీ రంగప్రవేశం చేసిన తమన్నా ఇప్పటికి కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. తాజాగా సంబంధించిన న్యూస్ ఒకటి బాగా వైరల్ అవుతుంది. తమన్నా ఆస్తుల విలువ దాదాపు 120 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తుంది.

ఆమె సరాసరి ఏడాదికి 12 కోట్లు దాకా సంపాదిస్తున్నట్లు ఇండస్ట్రీ లో వినిపిస్తున్న మాటలు తమన్నా ఒక్కో సినిమాకు 4 నుంచి 5 కోట్లు దాకా రెమ్యూనరేషన్ అందుకుంటుంది. పైగా ఒక్కో ఐటమ్ సాంగ్ కి సినిమాను బట్టి 50 లక్షల నుంచి కోటి రూపాయలు తీసుకుంటుంది. వీటికి తోడు కొన్ని సంస్థలకు అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది ఈ మిల్క్ బ్యూటీ. ముంబై లో తమన్నా నివసిస్తున్న ఇంటి ఖరీదు దాదాపు 16 కోట్లకు పైగానే ఉంటుంది. ఆమె దగ్గర లెన్ద్రోవర్ డిస్కవరీ స్పోర్ట్స్, BMW లాంటి ఖరీదైన కార్లు నాలుగైదు ఉన్నాయి. పైగా తమన్నా సొంత నగల దుకాణం కూడా నిర్వహిస్తోంది.

హీరోయిన్ గా అరంగ్రేటం చేసిన కొన్ని సంవత్సరాల కాలంలోనే అటు తమిళంలో కావచ్చు ఇటు తెలుగు లో అగ్ర హీరోలందరితోనూ నటించింది. ఆ సమయంలో ఇంత రెమ్యూనరేషన్స్ లేకపోయినా కానీ ఎక్కువ సినిమాలు చేతిలో ఉండటంతో బాగానే వెనకేసింది తమన్నా. ప్రస్తుతం తెలుగు, తమిళ లోని సీనియర్ హీరోలకు తమన్నా బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. మరోవైపు అందాల ఆరబోతకు సై అంటూ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ రెండు చేతులతో సంపాదిస్తుంది తమన్నా భాటియా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *