తమన్నా 2005లో చాంద్ సా రోషన్ చెహ్రా అనే సినిమాతో హిందీలో అడుగుపెట్టింది. మొదటలో విఫలమైనా 2007లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన తెలుగు సినిమా హ్యాపీ డేస్ తమన్నాకి సరైన గుర్తింపును ఇచ్చాయి. అయితే ఇక తమన్నా సినిమాల విషయానికి వస్తే.. ఆమె ఈ మధ్య సినిమాల్లో కంటే వెబ్ సిరీస్‌ల్లో ఎక్కువగా కనిపిస్తోంది. అందులో భాగంగా తమన్నా ఇటీవల నెట్ ఫ్లిక్స్ కోసం లస్ట్ స్టోరీస్ 2 అనే వెబ్ సిరీస్‌లో కీలకపాత్రలో కనిపించింది. అంతేకాదు ఈ వెబ్ సిరీస్ కోసం ఆమె కాస్తా బోల్డ్‌గా కనిపించింది.
అందులో భాగంగా కొన్ని రొమాంటిక్ సన్నివేశాల్లో నటించింది. ఈ లస్ట్ స్టోరీస్ కోసం మాత్రం తన ప్రియుడు విజయ్ వర్మతో ముద్దు సన్నివేశంలో నటించింది. గత కొన్నాళ్లు తమన్నా, విజయ్‌ను ప్రేమిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఆమె ఎప్పుడూ ఈ విషయాన్ని ఒప్పుకోలేదు. అయితే ఇటీవల మాత్రం తమన్నా తోటి నటుడు విజయ్ వర్మను ప్రేమిస్తున్నట్లు.. అతను అంటే ఎంతో ఇష్టమని.. పేర్కోంది. ఇక తమన్నా ప్రియుడు విజయ్ వర్మ తెలంగాణ వ్యక్తి అని తెలిసిందే.

అతను హైదరాబాద్‌లో జన్మించారు. విజయ్ వర్మ తెలుగులో కూడా నటించారు. ముఖ్యంగా ఆయన నాని హీరోగా వచ్చిన MCAలో విలన్‌గా వావ్ అనిపించారు. హిందీలో విజయ్ వర్మ పలు హిట్ సినిమాల్లో నటించి పాపులర్ అయ్యారు. ఇటీవల అమెజాన్ వెబ్ సిరీస్ దాహద్‌లో ఓ సైకో పాత్రలో నటించి కేక పెట్టించారు. ఇక్కడ విషయం ఏమంటే.. విజయ్ వర్మ, తమన్నా కలిసి ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. అయితే ఈ ఇద్దరూ జంటగా లేటెస్ట్ వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్ 2లో నటించారు.