కలర్స్ స్వాతి హీరోయిన్గా అవకాశాలు అందుకొని మంచి సక్సెస్ అయినప్పటికీ అనంతరం ఈమెకు అవకాశాలు రాకపోవడంతో వికాస్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని విదేశాలలో స్థిరపడ్డారు. అయితే తెలుగు సినీ ప్రియులకు కలర్ స్వాతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
అష్టా చెమ్మా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అంతకు ముందు వెంకటేష్ నటించిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాతో తెలుగు వారికి దగ్గరయ్యింది. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. నిఖిల్ సరనస నటించిన కార్తికేయ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న స్వాతి.
పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. చాలా కాలం తర్వాత స్వాతి రీఎంట్రీ ఇస్తుంది. ఇటీవలే సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తో కలిసి సోల్ ఆఫ్ సత్య పేరుతో ఓ ఆల్బమ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మంత్ ఆఫ్ మధు సినిమాతో వెండితెరపై సందడి చేయబోతుంది. ఇందులో నవీన్ చంద్ర ప్రధాన పాత్ర పోషించారు. వీరిద్దరు కలిసి గతంలో త్రిపుర చిత్రంలో నటించారు.