ప్రియాంకకు చిన్నప్పటి నుంచి ఐ సైట్ ఉంది. అందుకోసం కళ్లజోడు పెట్టుకుంటుంది. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో శివకుమార్ కూడా తన కళ్లకు సర్జరీ చేయించుకున్నాడట. ఇప్పుడు అదే సర్జరీని ప్రియాంకకు కూడా చేయించారు. అయితే బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ ప్రియాంక..
ఆ రియాలిటీ షో పూర్తయిన తర్వాత తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌లో బిజీ అయిపోయింది. ముఖ్యంగా తన యూట్యూబ్ ఛానెల్‌లో బాయ్‌ఫ్రెండ్ శివ్‌తో కలిసి వీడియోలు చేస్తూ.. ఎంతోమంది సబ్‌స్క్రైబర్లను సంపాదించుకుంది.
తాజాగా తన కళ్లకు జరిగిన సర్జరీ గురించి కూడా వివరంగా వీడియో తీసి తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేసింది. అసలు ప్రియాంక కళ్లకు సర్జరీ ఎందుకు చేయించుకుంటుంది, సర్జరీ ప్రక్రియ ఏంటి లాంటి సమాచారాన్ని తన బాయ్‌ఫ్రెండ్ శివ్.. ఈ వీడియోలో చెప్పుకొచ్చాడు.