సహజంగా రాజకీయాల్లో కనిపించని ఓ కట్టు బాటు ఉంటుంది. అదేమిటంటే ఎవరైనా తమను విమర్శిస్తేనే తిరిగి విమర్శించాలని అనుకుంటారు. ముఖ్యంగా రాజకీయాలకు సంబంధంలేనివారు. సెలబ్రిటీలు అయినా మరొకరు అయినా తమకు ఉన్న వ్యక్తిగత అనుబంధాల రీత్యా.. ఏదైనా పార్టీని సపోర్ట్ చేస్తే.. ఇతర రాజకీయ పార్టీలు పట్టించుకోవు.
కానీ వారు తమ మిత్రుల్ని పొగుడుకోకుండా. తమను విమర్శిస్తే మాత్రం ఎదురుదాడి చేస్తాయి. అయితే చంద్రబాబు ఘనత దేశ విదేశీ నాయకులకు తెలుసని స్పష్టం చేశారు. హైదరాబాద్ ను హైటెక్ నగరంగా చంద్రబాబు మార్చారని కొనియాడారు. ఇటీవల చాలా కాలం తర్వాత హైదరాబాద్ సందర్శించడం జరిగింది.
ఆ సమయంలో నేను హైదరాబాద్ లో ఉన్నానా లేకపోతే న్యూయార్క్ లో ఉన్నానా అనిపించింది. 20 ఏళ్ల కిందటే ఐటీరంగం అభివృద్ధి గురించి దేశంలో చెప్పిన వ్యక్తి చంద్రబాబు. ఆయన ఓడిపోయిన గెలిచిన. నిత్యం ప్రజలకు ఏదో చేయాలని తపిస్తుంటారు. 2024 ఎన్నికలలో చంద్రబాబు గెలిస్తే దేశంలో ఏపీ నెంబర్ వన్ అవ్వటం గ్యారెంటీ అని ఎన్టీఆర్ ఆత్మ చంద్రబాబును దీవిస్తుంది అని రజనీకాంత్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.