దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు నిర్మాతగా ఆర్.కె టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై గంగనమోని శేఖర్ దర్శకత్వంలో ‘‘సర్కారు నౌకరి’’ చిత్రం తెరకెక్కుతోంది. సింగర్ సునీత తనయుడు ఆకాష్ ఈ సినిమాతో హీరోగా తెరకు పరిచయం కాబోతోన్నారు. భావనా వళపండల్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇంట్రెస్టింగ్ గా ఉంది. అయితే తన గాత్రంతో టాలీవుడ్ లోకాన్ని ఉర్రూతలూగిస్తున్న సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా పరిచయం కాబోతున్నాడు.
సర్కారు నౌకరి అనే సినిమాతో ఆకాష్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు నిర్మాతగా ఆర్.కె టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై గంగనమోని శేఖర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ లుక్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది సునీత. ఈ రోజు ఒక కొడుకు, తల్లి కల నిజమైన రోజు. శుభాకాంక్షలు ఆకాష్!
ఈ మూవీ కోసం నువ్వు పడిన శ్రమ, అంకితభావం, త్యాగానికి ప్రతీకగా ఈ పోస్టర్ నిలుస్తోంది. ప్రపంచంతో మీరు పంచుకోబోతున్న కథ మాత్రమే కాకుండా, మీ కలలను సాకారం చేసుకుంటున్నారు. మీ కల నెరవేరడం మొదలైంది. నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా ఆల్ ది బెస్ట్ అని పోస్ట్ పెట్టింది సింగర్ సునీత. దీంతో ఈ పోస్ట్ చూసి ఆకాష్‌కి వెల్‌కమ్ చెబుతోంది టాలీవుడ్ లోకం.
సర్కారు నౌకరి అంటూ రాబోతోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌లో హీరో సైకిల్ మీద కనిపిస్తుండటం.. బ్యాక్ గ్రౌండ్‌లో ఉన్న చెట్టుకి ఓ డబ్బా వేలాడటం, దానిపై ‘పెద్ద రోగం చిన్న ఉపాయం’ అని రాసి ఉండటం ఇవన్నీ కూడా సినిమా మీద మరింత ఆసక్తిని పెంచేస్తున్నాయి. హీరో ఆకాష్ కూడా ఎంతో సహజంగా కనిపిస్తున్నారు. ఒక్కడి ఆలోచనతోనే విప్లవం మొదలవుతుంది అని ఈ ఫస్ట్ లుక్‌తో మేకర్లు వదిలిన క్యాప్షన్ చూస్తుంటే సినిమాలో కథ ఎంతో లోతుగా, బలంగా ఉన్నట్టు అనిపిస్తుంది.