సుమ చావు భయంతో వాళ్లకు ఆ సీక్రెట్ చెప్పేసిందా…? వెలుగులోకి షాకింగ్ విషయాలు.

సుమ.. మీడియా ప్రతినిధులు స్నాక్స్ తినేందుకు వెళ్లినట్టున్నారు. కెమెరాలు అమర్చి వదిలేసి వెళ్లినట్టున్నారు. దీంతో ఈవెంట్ ప్రారంభించే క్రమంలో సుమ కౌంటర్లు వేసింది. మీడియా వారు స్నాక్స్‌ని కూడా భోజనంలా తింటున్నారు.. త్వరగా వచ్చిన కెమెరాలు సెట్ చేయండి అంటూ సెటైర్లు వేసింది. అయితే కెరీర్ పరంగా సుమ ఎంత గొప్పగా సక్సెస్ అయిందో.. ఇక తన పర్సనల్ లైఫ్ లో కూడా ఆమె అంతే గొప్పగా సక్సెస్ అయింది. రాజీవ్ కనకాలకి ఉత్తమ ఇల్లాలుగా ఉంటూ ఎంతో చక్కగా పిల్లల్ని పెంచుతూ ఆమె తన భర్తకిచ్చే మర్యాదగాని పిల్లలను పెంచుకునే తీరుగాని..

అంత బిజీగా ఉండే ఒక మహిళ కుటుంబాన్ని కూడా అంత తీర్చిదిద్దుకోవడం నిజంగా తెలుగుజాతి ఆడవాళ్లు గర్వించే విధంగా ఉంటుంది. అయితే సుమ ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుమ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎంతోమంది ఆడవాళ్లు భర్తలు చనిపోయిన తర్వాత కనీస డబ్బులు లేక పని చేసుకుంటూ బ్రతుకుతున్నారు. కొందరు ఆడవాళ్ళకి బ్యాంక్ అకౌంట్ కూడా లేకుండా, ఆ మాత్రం నాలెడ్జ్ కూడా లేకుండా కష్టాలు పడుతూ బతుకుతున్నారు. నా పిల్లలకు మాత్రం నేను కుటుంబంలో అన్ని విషయాలలో చెప్తాను.

ముఖ్యంగా నేను చనిపోయిన వెంటనే ఎక్కడెక్కడ ఎలాంటి ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి.. వాటిని ఎలా కలెక్ట్ చేసుకోవాలి.. కుటుంబాన్ని ఎలా సేఫ్ చేసుకోవాలి అన్ని ముందుగానే చెప్పి ఉంచాను. వాళ్ళు ఎందుకు ఇలాంటి మాటలు చెప్తావు అని అన్నా కూడా.. లేదు ఏ క్షణం ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. నేను చనిపోయిన వెంటనే మీకు ఏదీ కూడా తెలీదు అని ఉండకూడదు. అన్నీ తెలుసుకొని, అన్ని జాగ్రత్తగా చూసుకొని కుటుంబాన్ని సంరక్షించుకోవాలని ముందుగానే చెప్పి ఉంచుతున్నాను అని సుమ చెప్పిన మాటలకు.. అభిమానులు ఆమె జాగ్రత్తకు ఆనందించినా.. ఆమె చావును తలంచడం వాళ్లకు నచ్చలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *