కొన్ని రోజుల క్రితం సుమ రాజీవ్ ల కొడుకు రోషన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు రాగా ఎట్టకేలకు ఆ వార్తలు నిజమయ్యాయి. ఇప్పటికే రోషన్ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి కాగా త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన రాజీవ్ కనకాల కొడుకు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సుమ పిల్లలకు ఎప్పుడూ నచ్చిన పనే చేయమని చెబుతుందని రోషన్ కు హీరో కావాలనే ఆసక్తి ఉండటంతో సినిమాల్లోకి వస్తామంటే అంగీకరించామని చెప్పారు.
అయితే తెలుగు ప్రేక్షకులకు యాంకర్ సుమ పరిచయం అక్కరలేని పేరు. బుల్లితెరపై రారాణిగా తన యాంకరింగ్‌తో స్టార్‌డమ్ సంపాదించుకున్న సుమ ఎన్ని వేల షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారో లెక్కేలేదు. ప్రీరిలీజ్ ఈవెంట్‌లు, టాక్ షోలు.. ఇలా వరుస షూటింగ్‌లతో సుమ ఎంత బిజీగా ఉన్నా గృహిణిగా, తల్లిగా తన బాధ్యతలు చక్కగా నిర్వహిస్తుంటారు. బుల్లితెరకే పరిమితం కాకుండా అప్పుడప్పుడూ వెండితెరపై కూడా మెరిసి అలరిస్తున్నారు.
వర్క్‌లైఫ్, ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్స్ చేస్తూ ఇప్పటికీ వరుస ప్రోగ్రాములతో బుల్లితెరపై దూసుకుపోతున్నారు. సుమ, రాజీవ్ కనకాలకు ఇద్దరు పిల్లలున్నారనే విషయం అందరికీ తెలుసు. కొడుకు రోషన్ కార్తిక్ కనకాల, కూతురు స్నేహనస్విని కనకాల.. ప్రస్తుతం వీరు ఎలా ఉన్నారో తెలుసా..? వీరి లేటెస్ట్ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. సుమ నటిగా, వ్యాఖ్యతగా మాత్రమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేపడుతుంటారు.