నటి సుకన్య రెండో పెళ్లి చేసుకోబోతుందని తమిళ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఆమె ఓ సంపన్న వ్యాపారవేత్తతో నిశ్చితార్థం చేసుకుందని, త్వరలోనే వీరి పెళ్లి జరగనుందని ఆ వార్తల సారాంశం. కాగా.. వీటిపై సుకన్య స్పందించింది. అయితే ఒకప్పుడు హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగొందింది నటి సుకన్య. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో పలు ల్లో హీరోయిన్‌గా నటించింది. ముఖ్యంగా ‘భారతీయుడు’ లో కమల్ హాసన్ భార్యగా అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది.
తెలుగులో పెద్దరికం, అమ్మ కొడుకు, కెప్టెన్, ఖైదీ నెంబర్ వన్ తదితర ల్లో హీరోయిన్‌గా నటించింది. మధ్యలో కాస్త గ్యాప్ తీసుకున్నప్పటికీ సాంబ, శ్రీ, మున్నా, అధినాయకుడు, శ్రీమంతుడు తదితర ల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించింది. 2002లో శ్రీధరన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని అమెరికా వెళ్లిపోయింది సుకన్య. అయితే కొన్ని కారణాలతో భర్త నుంచి విడిపోయింది. విడాకులు తీసుకుని మళ్లీ వెంటనే ఇండియాకు వచ్చేసింది. ఆతర్వాత మళ్లీ లో బిజీగా మారిపోయింది.

సుకన్య వయస్సు ప్రస్తుతం 50 ఏళ్లు. త్వరలో ఆమె మళ్లీ పెళ్లి చేసుకోనుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా ఈ రూమర్లపై స్పందించిందీ అందాల తార. రెండో పెళ్లి వార్తలపై తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చింది. ‘నాకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదు. ఒకవేళ ఇప్పుడు పెళ్లి చేసుకుంటే పుట్టే పిల్లలు.. అమ్మ అని పిలుస్తారా? లేదా అమ్మమ్మ అని పిలుస్తారా? అని తనదైన శైలిలో కౌంటర్లు వచ్చింది. దీంతో నటి సుకన్య రెండో పెళ్లి కేవలం పుకార్లేనని తేలిపోయింది.