సుడిగాలి సుధీర్ తెలుగు భాషా నటుడు, స్టాండ్-అప్ కమెడియన్, ఈయన తెలుగు భాషా దూరదర్శినిలో హాస్యకరమైన పాత్రలలోజబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ నటనకు ఆయనకి ఒక గుర్తింపు వచ్చింది. అతను సీజన్ 9, సీజన్ 10, సీజన్ 11, సీజన్ 12 కొరకు ధీ అల్టిమేట్ డాన్స్ షోలో జట్టు నాయకుడు. వారం వారం టీవీలో వచ్చి నవ్వించడం వేరు.. అక్కడ ఏం చేసినా నవ్వుతారు. కాస్త ఇమేజ్ వచ్చిందంటే చాలు..
ఏం కామెడీ చేసినా హాయిగా కడుపులు చెక్కలయ్యేలా నవ్వుతుంటారు. పైగా 10 నిమిషాల పాటు ఓ స్కిట్ చేసి నవ్వించడం వేరు.. ఆ ఇమేజ్ నమ్ముకుని సినిమా చేసి హీరోగా సక్సెస్ అందుకోవడం వేరు. ఇప్పుడు ఈ రెండింటికీ మధ్యలోనే ఉన్నాడు సుడిగాలి సుధీర్. బుల్లితెరపై ఈయన ఇమేజ్ గురించి చెప్పనక్కర్లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే స్మాల్ స్క్రీన్ పవర్ స్టార్ మనోడు.. సుధీర్ అని పేరు కనబడగానే నవ్వులు మొహాలపై అలా వచ్చేస్తాయంతే.
అంతగా తన కామెడీతో మ్యాజిక్ చేసాడు సుధీర్. నిజంగానే సుడిగాలి లాంటి పంచులతో కితకితలు పెట్టడంలో ముందుంటాడు ఈ కమెడియన్. అయితే ఈ మధ్య స్మాల్ స్క్రీన్ కంటే పెద్ద స్క్రీన్‌పై కనిపించడం అలవాటు చేసుకున్నాడు సుధీర్. అక్కడే వరస సినిమాలు చేస్తున్నాడు కూడా.