సుడిగాలి సుధీర్.. ఇంటర్ మధ్యలో గ్యాప్ వచ్చింది. మళ్లీ ఎగ్జామ్స్ రాయడానికి సంవత్సరం వెయిట్ చేయాలి. ఈ లోపు ఏదో ఒకటి చేద్దామనుకునే లోపు మా నాన్నకు యాక్సిడెంట్ అయింది. కాలుకు ఫ్చాక్చర్ అయింది. రాడ్ వేశారు. ఆయన షుగర్ పేషెంట్ కావడంతో మా అందరిలో భయం. నేను 17 ఏళ్ల పిల్లోడిని. డాడీ ఆరు నెలలు బెడ్ మీద ఉన్నారు. ఏదైనా చేయాలన్నా ఎవరికీ ఏమీ రాదు. అపుడు నేను పెద్ద కొడుకుగా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను.
షోలలో నవ్వుతు, నవ్విస్తూ, అందరూ తన మీద పంచ్ లు వేస్తున్నప్పటికీ… స్పోర్టివ్ గా తీసుకుంటూ వినోదాన్ని పంచడమే ప్రధాన అజెండా గా మరల్చుకొని ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన సుధీర్ జీవితం లో ఒక చీకటి కోణం దాగుందని మనలో చాలా మందికి తెలీదు. జీవితంలో ఎన్ని కష్టనష్టాలకోర్చి సుధీర్ ఈ స్థాయిలో నిలిచాడో చూపెడుతూ నిన్న ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ డాన్స్ ప్రోగ్రాం లో డాన్స్ ప్రదర్శన ద్వారా చూపెట్టారు. కంటెస్టెంట్ జతిన్, సుధీర్ క్యారెక్టర్ లో లీనమైపోయి ఆ డాన్స్ ను రక్తి కట్టించాడు.
అందులోని డాన్స్ విశేషాలను పక్కనుంచితే… సుధీర్ జీవితంలో ఎదుర్కున్న సవాళ్ళను, అవమానాలను తిరస్కరణలను అన్నిటిని మనసు ద్రవించేలా ప్రదర్శించాడు జతిన్. ఈ డాన్స్ చూస్తున్నంతసేపు అక్కడున్న వారందరి కళ్ళలోనూ నీళ్లు తిరిగాయి. సిల్వర్ స్క్రీన్ మీద తాను కనపడాలనేది తన తల్లి కళ అని, అది నెరవేర్చడమే తన కోరిక అంటూ డాన్స్ ప్రారంభమయింది. వాస్తవంగా కూడా సుధీర్ ని చిన్నప్పటినుండి అతని తల్లి వెండితెర మీద చూడాలని కలలు కనేదట.