ఐదో వారం ఎలిమినేషన్ కూడా విచిత్రంగా జరిగింది. ముందు ఎలిమినేషన్‌తోనే షో స్టార్ట్ కావడం విశేషం. ఈ వారం నామినేషన్‌లో ఎడుగురు ఉన్నారు. వీరిలో శివాజీ, తేజ, అమర్‌దీప్, గౌతంకృష్ణ, ప్రియాంక, యావర్, శుభశ్రీ ఉన్నారు. అయితే నాగ్ ఎంట్రీ తోనే ఎలిమినేషన్‌తో ఈ ఎపిసోడ్ ప్రారంభమవుతుందని తెలిపారు. నామినేషన్లలో ఉన్న ఏడుగురుని చీకటి గదిలోకి తీసుకెళ్లి భయపెట్టి మరీ ఎలిమినేట్ చేశారు.
యావర్‌ని, తేజని, గౌతమ్, శుభశ్రీలను టచ్ చేసిన దెయ్యం. చివరికి శుభశ్రీ ని తీసుకెళ్లిపోయింది దెయ్యం. దీంతో అంతా షాక్ అయ్యారు. ఐదో వారం కూడా అమ్మాయే ఎలిమినేట్ కావడం గమనార్హం. దీంతో ఆమె కూడా షాక్ అయ్యింది. ఈ సందర్భంగా తన జర్నీ చూసుకుని ఎమోషనల్ అయ్యింది.

అనంతరం కంటెస్టెంట్ల గురించి స్వీట్ మెమరీస్, బ్యాడ్ మెమరీస్‌ని షేర్ చేసుకుంది శుభశ్రీ. అయితే ఇంటి నుంచి ఐదో వారం ఎలిమినేట్ అయ్యిన శుభశ్రీ రెమ్యూనరేషన్ విషయానికి వస్తే.. శుభశ్రీ- 2 లక్షలు వారానికి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో 5 వారాలకు 10 లక్షలు తీసుకున్నట్లు సమాచారం.
