క్లాస్ రూమ్ లోనే పెళ్లి చేసుకున్న స్టూడెంట్స్. వైరల్ వీడియో..!

ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులు పిల్లలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తూ ఉండడంతో ప్రస్తుతం చిన్న వయసులోనే ప్రేమ అనే పేరుతో ఎంతో మంది తప్పుదోవ పడుతున్నారు అనే విషయం తెలిసిందే. కొంతమంది యుక్త వయస్సు వచ్చిన తర్వాత ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటే కొంత మంది మాత్రం ఏకంగా చిన్న వయసులోనే ప్రేమించడం చదువును గాలికి వదిలేసి చెట్టాపట్టాలేసుకుని తిరగటం లాంటివి చేస్తున్నారు. అయితే రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుతున్న ఓ మైనర్ బాలిక, మైనర్ బాలుడు క్లాస్ రూమ్ నే మండపంగా మార్చుకున్నారు.

క్లాస్ రూమ్ లోనే మైనర్ బాలుడు బాలిక మెడలో మూడు ముళ్ళు వేసేశాడు. ఈ తతంగాన్ని మొత్తం ఓ బాలిక వీడియో తీసింది. ఈ విషయం బయటకు రావడంతో కాలేజీలో పెళ్లి జరిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వైరల్ అయిన ఫోటోలు వీడియోలు కాలేజీ ప్రిన్సిపల్ వద్దకు వెళ్లాయి. దీంతో ప్రిన్సిపల్ విద్యార్థులకు గట్టి వార్నింగ్ ఇచ్చి టీసీ ఇచ్చి పంపించేశారు. పిల్లలు చేసిన ఈ పనికి ఇరు కుటుంబాలు తలలు పట్టుకున్నారు. వారు చేసిన పనికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు.

అయితే విద్యార్థులు మాత్రం ఏదో సరదాగా చేసాం అని చెప్పడం గమనార్హం. సరదాగా చేసిన అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఏది ఏమైనా స్టూడెంట్స్ చేసిన పని పెద్ద తప్పు. అలా చేసింది కాక సోషల్ మీడియాలో పెట్టడం మరో తప్పు. దీని వలన వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ సోషల్ మీడియా వచ్చాక పిల్లలు కూడా బాగా చెడిపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *