ఆగిపోయిన దగ్గుబాటి అభిరామ్ పెళ్లి, కారణం ఎవరో తెలుసా..?

నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఇంట పెళ్లి సందడి నెలకొనబోతోంది. ఆయన రెండో తనయుడు, రానా దగ్గుబాటి సోదరుడు అభిరామ్‌ పెళ్లి ఖరారైనట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా అభిరామ్ పెళ్లి గురించి ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అయితే అభిరామ్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నటువంటి తరుణంలో తనని చేసుకోబోయే అమ్మాయి స్నేహితులు తనని ఆటపట్టిస్తున్నారని తన కూతురు మానసికంగా ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది.

ఇలా పెళ్లికి ముందే తన కుమార్తె ఇలాంటి మానసిక ఇబ్బందులను ఎదుర్కోవడం తమకు చాలా బాధగా ఉందని ఇక పెళ్లి తర్వాత తన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయంగా ఉంది అంటూ వధువు తండ్రి సురేష్ బాబుతో మాట్లాడి ఈ పెళ్లి క్యాన్సిల్ చేయించుకున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇలా అభిరాం వివాహం క్యాన్సిల్ అయింది అన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిరామ్ కి శ్రీ రెడ్డి ఉసురు భారీగా తగిలినట్టు ఉంది అందుకే ఆయన ఏం చేయాలనుకున్న అట్టర్ ప్లాప్ అవుతున్నాయి అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.

ఇప్పటికే అహింసా సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటే పెళ్లి కూడా క్యాన్సిల్ కావడంతో శ్రీరెడ్డి ఉసురు తగిలిందని అందుకే ఈయనకు అన్ని చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.మరి అభిరామ్ పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ ఈ విషయం గురించి వెంటనే దగ్గుబాటి ఫ్యామిలీ స్పందించకపోతే ఈ వార్తలు మరిన్ని పరిణామాలకు దారి తీసే అవకాశాలు ఉంటాయని అభిమానులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *