కొన్ని నెలల క్రితం ఐశ్వర్య రజనీకాంత్ ఇంట దొంగతనం కేసులో ఇంటి దొంగ ఎవరో పోలీసులు పసి కట్టేశారు. ఆమె ఇంట్లో పనిమనిషి దొంగతనం చేసిందని గుర్తించారు. అలాగే యాక్టర్ శోభన ఇంటర్ దొంగతనం విషయంలో కూడా ఇదే జరిగింది ఆమె ఇంట్లో పనిమనిషి దొంగతనానికి పాల్పడింది. ఇక సింగర్ విజయ్ ఏసుదాస్ ఇంట దొంగతనంలో ఇప్పటివరకు దర్యాప్తు కొనసాగుతుంది.
ఇక ఘర్షణ సినిమాలో హీరోయిన్గా నటించిన నిరోషా ఈ సినిమాతో యూత్ కు ఎంతగానో దగ్గర అయింది. అయితే తాజాగా మరో సీనియర్ హీరోయిన్ నిరోషా ఇంట దొంగతనం జరిగింది. చెన్నైలోని తన ఇంట్లో బంగారు ఆభరణాలను దొంగలించారంటూ నిరోష తేనంపేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన ఇంట్లో నగలు, డబ్బుతో పాటు కొన్ని ఆస్తి పత్రాలు కూడా మాయమయ్యాయి అంటూ ఫిర్యాదు చేశారు నిరోషా.
ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక పాత ఘర్షణ సినిమాలో హీరోయిన్ నటించిన నిరోషా ఈ సినిమాతో యూత్ కు ఎంతగానో దగ్గర అయింది. ఈ సినిమాలో ఆమె ఒక బృందావనం.. సోయగం.. అంటూ స్విమ్మింగ్ పూల్ లో హొయలొలికించ్చింది. ఇప్పటికీ ఆ పాట యూట్యూబులో మారుమోగిపోతూనే ఉంటుంది. సింధూరపువ్వు సినిమా కూడా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది.