1962 సెప్టెంబర్ 18న తమిళనాడులోని నాగపట్నంలో పుట్టిన నిషా.. తన 18వ ఏట ‘మంగళ నాయగి’ అనే తమిళ్ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసింది. 80వ దశకంలో తన గ్లామర్‌తో సిల్వర్ స్క్రీన్‌ను మరింత బ్యూటిఫుల్‌గా మార్చేసింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో నటించి, స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. రజినీ కాంత్, కమల్ హాసన్, భాను చందర్, మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలతో ఆడి పాడింది. అయితే నిషా.. సడెన్ గా ఇండస్ట్రీకి దూరమయ్యింది.
ఒక దుర్మార్గపు నిర్మాత వలలో చిక్కుకొని వ్యభిచార కూపంలో ఇరుక్కుపోయింది. అలా ఎందుకు చిక్కుకుంది అంటే.. అవకాశాలు లేక .. ఎంత స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుందో.. అవకాశాలు లేక.. డబ్బు కోసం విలవిలలాడే పరిస్థితికి చేరుకుంది. ఎక్కడకు వెళ్లినా అవకాశాలు అందకపోయేసరికి.. చేసేది లేక డబ్బు కోసం ఒక నిర్మాత పంచన చేరింది. అతడు ఆమె అందాన్ని చూసి.. డబ్బు వస్తుందని చెప్పి.. ఆమెను బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపాడు. మొదట బలవంతంగా వెళ్లినా.. ఆ తరువాత ఆమె అక్కడేఉండిపోవాల్సి వచ్చింది. ఎంత బయటపడాలి అని చూసినా.. ఆ నరకం నుంచి బయటపడలేకపోయింది.
ఇక అలా ఉన్నప్పుడే ఆమె ఎయిడ్స్ బారిన పడింది. అందం కరిగిపోయింది.. బలం లేకపోయింది.. ఎంతో అందంగా ఉండే నిషా.. అందవిహీనంగా మారేసరికి ఆ వ్యభిచార కూపం కూడా ఆమెను బయటకు నెట్టేసింది. ఎక్కడకు పోలేని పరిస్థితిలో నడిరోడ్డుపై ముష్టి ఎత్తుకొని బతికింది. చివరకు దర్గాలో ఆమె తలదాచుకునే దుస్థితి. ఇక ఆమెను గుర్తుపట్టిన ఒక ఎన్జీవో.. హాస్పిటల్ కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించగా .. ఎయిడ్స్ ముదురిపోయిందని తెలిపినట్లు సమాచారం. అలా ఆమె 2007 లో కన్నుమూసింది. ఎలాంటి ఒక హీరోయిన్.. ఎలా బతికిన నటి .. చివరికి అలా అనాధల నడిరోడ్డుపై ఎయిడ్స్ తో మృతి చెందింది.
