ఆ స్టార్ హీరోతో ప్రేమలో పడ్డ రజనీకాంత్ కూతురు. పెళ్ళి కూడా..?

ఉన్నఫలంగా ఐశ్వర్యపై ఇలాంటి పుకార్లు రావడానికి ఓ కారణం ఉంది. ఈమధ్య కోలీవుడ్ కు చెందిన ఓ హీరోతో ఆమె కనిపించింది. రిసార్ట్ లో అతడితో ఆమె కనిపించడంతో ఈ రెండో పెళ్లి పుకార్లు బలంగా వ్యాపిస్తున్నాయి. అయితే ఆమె ఇటీవల ఒక కోలీవుడ్ హీరోతో రిసార్ట్‌లో కనిపించడంతో రెండో పెళ్ళికి సంబందించిన ఊహాగానాలు తెర మీదకు వచ్చాయి. ఐశ్వర్య ముందుగా 2004లో నటుడు ధనుష్‌ను వివాహం చేసుకుంది, దాదాపు 18 సంవత్సరాల వివాహ బంధం తరువాత జనవరి 2022లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు.

అయితే అసలు వారు విడిపోవడానికి కారణాలు ఏంటి అని తెలియక పోవడంతో అభిమానులలో ఆసక్తి పెరిగింది. నిజానికి అధికారికంగా విడాకులు తీసుకున్న తరువాత కూడా ఐశ్వర్య -ధనుష్ మధ్య సయోధ్య కుదరదనే పుకార్లు కూడా వ్యాపించాయి. ఈ జంటను తిరిగి కలిపేందుకు రజనీకాంత్ స్వయంగా జోక్యం చేసుకుంటున్నట్లు వచ్చిన వార్తల ద్వారా ఊహాగానాలు కూడా పెరిగాయి. అయితే ఇప్పుడు ఐశ్వర్య రెండో పెళ్లిపై పుకార్లు వ్యాపించడంతో అందరి దృష్టి ఆమెపైనే పడుతోంది.

ఎందుకంటే గతంలో ఐశ్వర్య సోదరి సౌందర్య కూడా తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చి మరో వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. ఆయితేఇప్పుడు ఐశ్వర్య రెండో పెళ్లి వార్త బయటకు రావడంతో ఓ మహిళ రెండో పెళ్లి చేసుకుంటే తప్పేమీ లేదని కొందరు ఆమెకు మద్దతుగా కామెంట్ చేస్తున్నారు. అయితే ఐశ్వర్యకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, మళ్లీ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటని నెటిజన్లలోని కొన్ని వర్గాలు ఐశ్వర్యపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఐశ్వర్య ఇప్పుడు లాల్ సలామ్‌ అనే సినిమాను దర్శకత్వం వహిస్తూ బిజీగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *