తెలుగులో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ అమ్మడు.అయితే చాలా కాలం తర్వాత క్రాక్ సినిమాతో హిట్ అందుకుంది శ్రుతిహాసన్, అయితే కమల్‌హాసన్-సారికల ముద్దుల కుమార్తె శ్రుతిహాసన్. 2000లో విడుదలైన చిత్రం ‘హేరామ్’తో వెండితెర పరిచయమైన ఈ ముద్దుగుమ్మ గాయనిగానూ ఎంతోమంది అభిమానాన్ని చూరగొంది.
నిత్యం సోషల్‌మీడియాలో చురుగ్గా ఉండే శ్రుతిహాసన్.. తనకు విభిన్నమైన ఫొటోషూట్‌తో ఫ్యాన్స్‌ను పలకరిస్తుంటుంది. హీరోయిన్ శ్రుతి హాసన్.. 1986 జనవరి 28న తమిళనాడులోని చెన్నెలో పుట్టింది. నటుడు కమల్ హాసన్ మొదటి కుమార్తె ఈమె. ‘అనగనగ ఓ ధీరుడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
ఆ తర్వాత అనేక బాలీవుడ్ చిత్రాల్లోనూ నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది విడుదలైన ‘వకీల్‌సాబ్’, ‘క్రాక్’ సినిమాలతో వరుస విజయాలు తన ఖాతాలో వేసుకుంది శ్రుతిహాసన్. ప్రస్తుతం ‘సలార్’, ‘లాబమ్’ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.