అందంగా కనిపించినన్నాల్లే వారికి అవకాశాలు ఉంటాయి. లేదంటే తగ్గిపోతాయి. దీంతో హీరోయిన్లు తమ అందాన్ని కాపాడుకోవటానికి ఎన్నో కష్టాలు పడుతుంటారు. కొన్నికొన్ని సార్లు సర్జరీలు కూడా చేయించుకుంటుంటారు. అలా సర్జరీలు చేయించుకున్న వారిలో చాలా మంది ప్రముఖ హీరోయిన్లు ఉన్నారు. అయితే మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతి హాసన్ ఆ తరువాత స్టార్ హీరోయిన్ అయ్యారు. తండ్రి కమలాసన్ బాటలోనే స్టార్ గుర్తింపు తెచ్చుకున్న ఈమె మిగతా ఇండస్ట్రీలో కంటే తెలుగులోనే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది.
ఇక్కడ స్టార్ హీరోలందిరితో నటించి ఆకట్టుకుంది. ఇక మెగా హీరోలైన చిరంజీవి, పవన్ కల్యాన్, అల్లు అర్జున్ లతో కలిసి నటించిన శృతిహాసన్ కొన్నాళ్ల గ్యాప్ తరువాత రవితేజతో కలిసి ‘క్రాక్’ సినిమాలో తన ప్రతాపం చూపించింది. గత కొంత కాలంగా స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ను కొందరు ట్రోలింగ్ చేస్తూ వస్తున్నారు. ఈ ట్రోలింగ్ ను తట్టుకోలేని శృతి సర్జరీపై సెన్షేషనల్ కామెంట్స్ చేసింది. తెలుగు సినిమాలను తక్కువ చేసిన శృతి ప్రస్తుతం ముంబయ్ లో ఉంటోంది. తన భాయ్ ప్రెండ్ శాంతాను హజారికతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో ఆమె ఖాళీగా ఉన్న సమయంలో ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో చాట్ చేస్తూ ఉంటుంది. అయితే ఓనెటిజన్ శృతిపై హాట్ కామెంట్స్ చేశాడు.
గతంలో లాగా శృతి లేదని, పూర్తిగా మారిపోయిందని అన్నారు. అంతేకాకుండా మీరు అందం కోసం సర్జరీ చేయించుకున్నారా? అని ప్రశ్నించారు. దీంతో శృతి స్పందించింది. ‘అవును.. నేను సర్జరీ చేయించుకున్నా.. అంతకుముందు నా ముక్కు లావుగా ఉండి ఇబ్బందికరంగా ఉండేది. సన్నగా ఉండేందుకు సర్జరీ చేయించుకున్నా..’ అని తేల్చి చెప్పింది. దీంతో ఇన్నాళ్లు శృతి హాసన్ ను కామెంట్స్ చేసిన వాళ్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. తెలుగులో వాల్తేరు వీరయ్య తరువాత శృతి హాసన్ మళ్లీ కనిపించలేదు. ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి ‘సలార్’ మూవీలో నటిస్తోంది.