ఈ సంవత్సరం సంక్రాంతికి అటు వీరసింహారెడ్డి ఇటు వాల్తేరు వీరయ్య.. రెండు సినిమాలలో అదరగొట్టిన శృతిహాసన్ త్వరలో ప్రభాస్ నటించిన పాన్ ఇండియన్ మూవీ సలార్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే శృతి ఒక అరుదైన వ్యాధితో బాధపడుతోంది అంటే.. ఎవరికీ నమ్మశక్యం కావడం లేదు.అసలు విషయానికి వస్తే.ఇదిలా ఉంటే శ్రుతిహాసన్ ఓ వ్యాధితో బాధపడుతుంది తెలుస్తోంది.
తాను ఒత్తిడి ఎక్కువైతే ఊహించని విధంగా మారిపోతుందట. తాను ఎక్కువ స్ట్రస్ ఫీలై అయితే ఆమెకు ఎక్కువ కోపం వస్తుందట. ఒత్తిడి ఎక్కువైతే విపరీతమైన ఆవేశానికి లోనవుతుందట. ఆ సమయంలో చిన్న విషయానికి కూడా విపరీతంగా కోపం తెచుకుంటుందట. అరిచి గోల గోల చేస్తుందట శృతి. కోపం తగ్గాకా.. ఎందుకు ఇలా చేశానా అని బాధపడుతుందట.
అయితే దీని తగ్గించుకునేందుకు ప్రయత్నాలు కూడా చేస్తుందట..స్ట్రెస్ ఎక్కువైనప్పుడు సైలెంట్ గా మ్యూజిక్ వింటుందట శ్రుతిహాసన్. ఇది అంత పెద్ద సమస్య కాదు అని అంటున్నారు నెటిజన్స్. కొంతమంది మాత్రం ఇది ఎక్కువ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ట్రీట్‌మెంట్ తీసుకోవాలి అంటున్నారు మరికొందరు. ఇప్పుడు ఈన్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.