ఆర్ నారాయణమూర్తి ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసా..?

గ్లోబలైజేషన్ పేరుతో రైతన్నను దోచుకొంటున్నారు. రైతులకు వ్యతిరేకంగా రూపొందించే చట్టాలపై నారాయణమూర్తి లాంటి సినిమాను ఆస్త్రంగా రూపొందించుకొని వాస్తవాలను బయటపెడుతున్నారు. రైతులు ఎక్కడైనా తమ పంటను అమ్ముకోవచ్చంటూ వారిని దగా చేస్తున్నారు. అయితే మార్కెట్, చవకగా దొరికే శ్రామిక దేశాలు, అలాగే భారీగా లాభాలను పొందడమే లక్ష్యంగా కొన్ని కార్పోరేట్ సంస్థలు వ్యవహరిస్తున్నాయి.

అలాంటి సంస్థల దోపిడి గుట్టు బయటపెట్టడానికే సినిమాను ఆర్ నారాయణ మూర్తి R narayana murty ఆయుధంగా ఎంచుకొన్నారు. ఆయన రూపొందించిన తాజా చిత్రం రైతన్న అలా తయారైందే. కార్పోరేట్, రాజకీయ వ్యవస్థలపై విమర్శనాస్త్రంగా రైతన్న చిత్రం రూపొందింది. రైతులపై కార్పోరేట్ సంస్థల దండయాత్రను కళ్ళకి కట్టినట్టు చూపించారు.. అని గద్దర్ తెలిపారు. ఇదే సందర్భంగా ఆర్ నారాయణమూర్తి ఆరోగ్యం గురించి గద్దర్ వెల్లడించారు. దాదాపు ఎనిమిది నెలల నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.

మా ఇంటికి రమ్మని పిల్చాను. అయినా ఆయన రాలేదు. నారాయణమూర్తి R narayana murty కి సొంత ఇల్లు, ఆస్తి అంటూ ఏవీలేవు. ఎడ్డిదో.. గుడ్డిదో.. పెళ్లాం ఉండాలి. సూటు లేదు, బూటు లేదు. ఒక బండి లేదు..ఇలా ఏమీ లేకుండా జీవిస్తున్నారు. తెర మీద మాత్రమే నటిస్తాడు తప్ప జీవితంలో నటించడు.. అని గద్దర్ పేర్కొన్నారు. అంతేకాదు నారాయణమూర్తి ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉన్నాడు. ఇంటి కిరాయి కట్టలేకనే సిటీకి 50 కిలోమీటర్ల దూరంగా ఓ అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *