సలార్ కాస్ట్యూమ్ వల్ల ఆ నటికి సర్జరీ, ఇంతకీ ఏం జరిగిందంటే..?

బాహుబ‌లి త‌ర్వాత హిట్ ముఖం చూడ‌లేక‌పోయిన ప్ర‌భాస్‌.. స‌లార్‌తో మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ ఎక్కేశాడు. ఇక‌పోతే ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ సోదరిగా రాధా రామ పాత్రలో నటించిన తమిళ నటి శ్రియారెడ్డి ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. సినిమాలో ప‌వ‌ర్ ఫుల్ రోల్ ను ఆమె పోషించింది. యాక్టింగ్ ప‌రంగా, లుక్స్ ప‌రంగా ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. అయితే విశాల్ సూపర్ హిట్ మూవీ తిమురు లో శ్రియ రెడ్డి నెగిటివ్ రోల్ చేసింది.

ఆ చిత్రంలో ఆమె పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. ఇక సలార్ లో చేసిన రాధారమ పాత్ర కోసం ఆమె చాలా కష్టపడ్డారట. ముఖ్యంగా కాస్ట్యూమ్స్ ఆమెను ఇబ్బంది పెట్టాయట. సలార్ లో రాధరమ బరువైన చెవి పోగులు పెట్టుకున్నారు. ఆ కారణంగా చెవులు చీరుకుపోయాయట. షూటింగ్ ముగిశాక సర్జరీ చేయించుకుందట. ఇక చీర రంగు విషయంలో గొడవ జరిగిందట. శ్రియ రెడ్డి మాట్లాడుతూ… ప్రశాంత్ నీల్ చిత్రాల్లో కాస్ట్యూమ్స్ డార్క్ కలర్స్ లో ఉంటాయి.

సలార్ లో కూడా బ్లాక్, గ్రే, ఆలివ్ గ్రీన్ కలర్స్ వాడారు. నాకు కూడా అదే రంగు కాస్ట్యూమ్స్ రూపొందించారు. ఓ సన్నివేశంలో ఎల్లో కలర్ చీర అయితే బాగుంటుందని నేను సూచించాను. అందుకు ప్రశాంత్ నీల్ ఒప్పుకోలేదు. అయితే ప్రశాంత్ నీల్ తో వాదించి పసుపు రంగు చీర ధరించాను, అని ఆమె అన్నారు. శ్రియ రెడ్డి నెక్స్ట్ ఓజీ చిత్రంలో నటిస్తుందట. పవన్ కళ్యాణ్-సుజీత్ కాంబోలో రానున్న ఓజీ మూవీలో కూడా ఆమెది నెగిటివ్ రోల్ అని ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గురించి ఆమె ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *