క్యూట్ గా హాట్ గా మాయ చేస్తున్న శ్రీలీల అందంగా కనిపిస్తే చూడాలని యువత కోరుకుంటారు. ఇప్పుడు ఆమె టాలీవుడ్ లో టాప్ లీగ్ లో కొనసాగుతున్న హీరోయిన్. అలాంటి హీరోయిన్ చేత అనిల్ రావిపూడి యాక్షన్ సీన్స్ చేస్తున్నాడు అంటే సంథింగ్ స్పెషల్ అనే చెప్పాలి. అయితే చక్కగా ఉయ్యాలలో కూర్చొని ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నారు బాలకృష్ణ, శ్రీలీల.
“మీ అబ్బాయి మోక్షజ్ఞ డెబ్యూ ఏ సంవత్సరంలో ఉండబోతోంది?” అని బాలకృష్ణను శ్రీలీల ప్రశ్నించారు. దీనికి బాలకృష్ణ సమాధానం చెప్పారు. “వచ్చే సంవత్సరం. కన్ఫామ్” అని బాలయ్య చెప్పేశారు. దీంతో 2024లో నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రం ఖాయంగా కనిపిస్తోంది. మోక్షజ్ఞ భవిష్యత్తు గురించి తనకు దిగులే లేదని, తాను ముందుగా కంగారుగా ఏదీ ప్లాన్ చేయనని బాలకృష్ణ చెప్పారు.
అయితే, మోక్షజ్ఞతో తాను ఆదిత్య 999 మ్యాక్స్ సినిమా చేస్తానని ఆయన చెప్పారు. ఆ సబ్జెక్టును తాను ఒక్క రాత్రిలోనే రెడీ చేశానని బాలకృష్ణ తెలిపారు. అయితే, మోక్షజ్ఞ తొలి సినిమా ఏదవుతుందో తనకు తెలియదని, అయితే రెండో చిత్రం మాత్రం ఆదిత్య999 మ్యాక్స్ అయి ఉంటుందని అన్నారు. అదే తొలి సినిమా కూడా కావొచ్చేమోనని అని కూడా బాలకృష్ణ అన్నారు. మొత్తానికైతే తన కుమారుడు మోక్షజ్ఞ 2024లో వెండితెరకు పరిచయం అవుతారని బాలయ్య స్పష్టం చేసేశారు.