నిత్యం ఏదో ఒక సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే సినీనటి శ్రీరెడ్డి తాజాగా మరోసారి సీరియస్ కామెంట్స్ చేశారు. అయితే ఈసారి చేసింది సినీరంగానికి చెందిన వ్యక్తినే. ఆ సినీనటుడికి రాజకీయాలను జోడిస్తూ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పార్టీకి దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఆ పార్టీ మంత్రలు అందరూ ఓటమి పాలయ్యారు.
175 సీట్లకు గాను కేవలం 10 స్థానాలను మాత్రమే గెలుచుకోనుంది. ఇలాంటి ఘోర ఓటమి వైసీపీ నేతలు ఎవ్వరూ ఊహించలేదు. అయితే జగన్ ఓటమి కన్ఫర్మ్ కావడంతో ఆయన వీరాభిమాని శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయింది. వైఎస్ జగన్ పరాజయంపై సంచలన కామెంట్స్ చేసింది. జగన్ అంటే పడిచచ్చే ఆమె వైఎస్సార్సీపీ ఓటమిపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.
గెలిచినా ఓడినా జగన్ అన్నని తక్కువ అంచనా వేయకండి.. అరణ్యం పాలైన అర్జునుడు తిరిగి రాజ్యాన్ని చేపట్టినట్టు, పట్టు వదలకుండా తన రాజకీయాన్ని చాకచక్యంగా కొనసాగిస్తాడు. ఆయన సైన్యంగా మేమంతా జగన్ అన్నతో ఉంటాం అని పేర్కొంది శ్రీ రెడ్డి.