తిరుపతిలో మోహన్‌బాబు యూనివర్సిటీలో నటుడు మంచు మోహన్ బాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్‌బాబుసహా ఆయన కుమారుడు మనోజ్ కూడా రాజకీయ విమర్శలు చేశారు.
అయితే, ఒక పార్టీ అని కానీ, ఒక నాయకుడు అని కానీ వారు ఎక్కడా ప్రస్తావించకుండానే కామెంట్లు చేయడం గమనార్హం. ప్రజలకు సూచనలు చేస్తున్నట్టే వ్యాఖ్యలు చేశారు. “నచ్చిన వారికి ఓటు వేసుకోండి“ అని చెబుతూనే ఎవరికి వేయాలో కూడా నర్మగర్భంగా చెప్పడం గమనార్హం. “ప్రధాని నరేంద్ర మోడీని చాలా సందర్భాల్లో కలిశాను.
అలాంటి ఆలోచనలు, విధానాలు కలిగిన వ్యక్తి భారతదేశానికి అవసరం. ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలి. ఇద్దరూ డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు మనవే.. లంచాలు తీసుకున్న డబ్బులు.. ఆ డబ్బులు తీసుకోండి. ఓటును మాత్రం నచ్చిన వారికి వేసి, భారతదేశ భవిష్యత్తు ముందుకు వెళ్లడానికి సహకరించండి.” అని మోహన్ బాబు పరోక్షంగా మోడీకి ఓటేయాలని పిలుపునిచ్చారు.