గత కొంత కాలంగా శ్రీను వైట్ల ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోని వరుస డిజాస్టర్స్ తో సతమతమవుతున్నారు. అందుకే ఈసారి కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మ్యాచో హీరో గోపీచంద్ తో ఒక మూవీ చేస్తున్నాడు. దీనికి సంబంధించి పూజా కార్యక్రమాలు ఈమద్యనే జరిగాయి. ఈ మూవీని చిత్రాలయం స్టూడియో నిర్మిస్తుంది.
ఈ మూవీకి సంబంధించి షూటింగ్ త్వరలో మొదలు కాబోతుంది. అయితే దర్శకుడు శ్రీను వైట్ల ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. తన ఫామ్‌హౌస్‌లోకి మొదటిసారిగా తెచ్చిన ఆవు మరణించింది. ’13 ఏళ్లగా మా ఫామ్‌లో ఉంటున్న ఆవు మరణించడంతో కుటుంబ సభ్యుల హృదయాలు శోకసముద్రంలో నిండిపోయాయి’ అంటూ ట్వీట్ చేశారు.
‘నా ఫామ్‌లోకి మొదటిగా తెచ్చుకున్న ఆవు మరణించింది. 13 ఏళ్లగా తనని మేమంతా కుటుంబ సభ్యురాలిగా భావించి ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాం. నా కూతుళ్లు ఇద్దరిను ఎంతో ప్రేమతో మా ఆవుని లక్ష్మీ అని పిలుస్తారు. మా లక్ష్మీకి సాంప్రదాయంగా అంత్యక్రియలు చేసి వీడ్కోలు చెబుతాం’’ అని శ్రీనువైట్ల లక్ష్మీ ఫొటోను షేర్ చేశారు.