బాలయ్య కొడుకుతో శ్రీలీల లవ్, లైవ్ లో బాలయ్య ఏం చేసాడో చుడండి.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కాజల్, శ్రీలీల నటనని బాలయ్య ప్రశంసించారు. ఇక శ్రీలీలతో నెక్స్ట్ ఆమె హీరోయిన్ గా, నేను హీరోగా చేయాలని ఉందని బాలయ్య నవ్వించారు. ఈ విషయం ఇంట్లో చెబితే మోక్షజ్ఞ నన్ను తిట్టాడు. ఏం డాడీ గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా.. నెక్స్ట్ కుర్ర హీరోని నేను వస్తున్నాను కదా అని తిడుతున్నాడు అంతో బాలయ్య చేసిన వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్య పరచడమే కాదు నవ్వులు పూయించాయి. ఈ చిత్రం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని బాలయ్య పేరు పేరునా అభినందించారు.

అయితే శ్రీలీల టాలీవుడ్‌కి పట్టిన ఫీవర్‌లా మారిపోయింది ప్రస్తుతం పరిస్థితి. పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌బాబుల నుంచి వైష్ణవ్‌ తేజ్‌ వరకు అందరు ఈ బ్యూటీనే కోరుకుంటున్నారు. ఆమెతో రొమాన్స్ కి సిద్ధమవుతున్నారు. ఏకంగా బాలయ్య సైతం తన నెక్ట్స్ సినిమాలో హీరోయిన్‌గా ఆమెని తీసుకోవాలనుకోవడం చూస్తుంటనే ఆమె క్రేజ్‌ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతగా టాలీవుడ్‌ లో సెన్సేషన్‌గా, హాట్‌ టాపిక్‌గా మారిందీ అందాల భామ. ప్రస్తుతం పది సినిమాలతో టాలీవుడ్‌ని ఊపేస్తుంది.

అందులో ఒకటి భగవంత్‌ కేసరి. బాలకృష్ణ హీరోగా, అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. కాజల్‌ హీరోయిన్‌గా చేయగా, శ్రీలీల బాలయ్యకి అన్న కూతురు పాత్రలో నటిస్తుంది. భగవంత్‌ కేసరి` ట్రైలర్‌ ఈవెంట్‌ తాజాగా వరంగల్‌లో జరిగింది. ఇందులో శ్రీలీల స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా మారింది. ఆమె లెహంగా ఓనీలో మెరిసింది. బ్లూ లెహంగా, రెడ్‌ ఓనీ వేసుకుని ఈవెంట్‌ మొత్తాన్ని తనవైపు తిప్పుకుంది. చిలిపి నవ్వులు, అల్లరి పనులతో సందడి చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *