భగవత్ కేసరి, ఆది కేశవ, ఉస్తాద్ భగత్ సింగ్, గుంటూరు కారం వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ శ్రీలీల చేతిలో ఉన్నాయి. ప్రస్తుతానికైతే టాలీవుడ్‌లో నెంబర్ స్థానం శ్రీలీలదే. ఇదిలా ఉంటే శ్రీలీలకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞతో శ్రీలీలకు పెళ్లి ఫిక్స్ అంటూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
అయితే ధమాకా సినిమాతో తెలుగులో బాగా పాపులర్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది డేంజర్ పిల్ల శ్రీలీల. దీంతో ఆమెకు వరుసపెట్టి సినిమా అవకాశాలు వచ్చాయి. ఇటీవలే స్కంద సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ త్వరలో బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదే కాకుండా దసరా నుంచి స్టార్ట్ చేస్తే సంక్రాంతి వరకు ఒక్కో నెలకు ఒక్కో సినిమాతో రెడీగా ఉంది శ్రీలీల. ఇలాంటి కెరీర్ పీక్స్ సమయంలో శ్రీలీల పెళ్లి చేసుకోనుందంటూ రూమర్స్ చక్కర్లు కొట్టాయి. ఇటీవల భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్లలో బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞతో ఓ ఫొటోలో కనిపించింది శ్రీలీల. దీంతో గాసిప్స్, రూమర్స్ తెగ పుట్టుకొచ్చేశాయి. బాలకృష్ణ కొడుకుతో శ్రీలీల పెళ్లికి రెడీ అయిందని పుకార్లు షికార్లు చేశాయి.