అందానికి అందం, నటనకు నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న శ్రీలీల.. చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అయినప్పటికీ మరిన్ని ప్రాజెక్టులను లైన్లో పెడుతూనే ఉంది. అయితే తాజాగా ఈ అమ్మడు చేసిన పనికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. శ్రీలీల చీర్స్ ఫౌండేషన్ అనే ఓ అనాథాశ్రమానికి సపోర్ట్ గా నిలుస్తుంది. గతంలో కూడా ఈ అనాథాశ్రమంకు వెళ్లి అక్కడి పిల్లలతో గడిపిన ఫోటోలు, వీడియోలు షేర్ చేసింది.
ఇంత చిన్న వయసులోనే సక్సెస్ తెచ్చుకొని ఇంకొంతమందికి సహాయపడుతుందని అంతా శ్రీలీలని అభినందించారు. ఈ చీర్స్ ఫౌండేషన్ కి ఎప్పుడు ఏం కావాలన్నా శ్రీలీల అందిస్తుంది… ఇక తాజాగా రాఖీ పౌర్ణమి సందర్బంగా పౌండషన్ లోని పిల్లలతో గడిపింది..అక్కడి పిల్లలకు రాఖీ కట్టి, వారికి స్వీట్స్ తినిపించి వారితో రాఖి పండగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. అక్కడి పిల్లలు శ్రీలీలకు స్పెషల్ బహుమతులు గిఫ్ట్ గా ఇచ్చారు.

అలా వారితో గడిపిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. అనాథ పిల్లలతో శ్రీలీల రాఖీ సెలబ్రేషన్ ఫోటోలు వైరల్ గా మారాయి. అందం, డ్యాన్స్, నటనతో ఇప్పటికే ప్రేక్షకులని ఫిదా చేసి ఎంతోమంది అభిమానులని సంపాదించుకున్న శ్రీలీల ఇప్పుడు ఇలా తన మంచితనంతో కూడా అందర్నీ మెప్పిస్తుంది.. ఈ ఫోటోలను ఆమె ఫ్యాన్స్ షేర్ చేస్తూ మరింత ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు.. ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ అమ్మడు ప్రస్తుతం 8 సినిమాలతో బిజీగా ఉంది.. త్వరలోనే ఆ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.