వామ్మో..! శ్రీలీల గంటకు ఎంత ఛార్జ్ చేస్తారో తెలుసా..!

అందం, అభినయం, డ్యాన్స్.. ఇలా ప్రతీ ఒక్క విషయంలో తనకు తానే సాటి.. నాకెవరూ రాలేరు పోటీ అని చెప్పకనే చెబుతోంది శ్రీలీల. తొలి ప్రాజెక్ట్‌తోనే అగ్రదర్శకనిర్మాతల ఫోకస్‌ అంతా తనవైపునకు తిప్పేసుకుంది శ్రీలీల. ఈ ఏడాది మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను, ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ కాంబోలో వచ్చిన స్కందలో మరోసారి ఇరగదీసింది. రీసెంట్‌గా బాలకృష్ణ టైటిల్‌ పోషించిన భగవంత్‌ కేసరిలో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. అయితే ఇక అది అలా ఉంటే..శ్రీలీల రెమ్యూనరేషన్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆమె ఏవైనా కమర్షియల్ ప్రమోషనల్ ఈవెంట్స్‌లో పాల్గోంటే భారీగా ఛార్జ్ చేస్తారట. శ్రీలీల ఒక ఈవెంట్‌లో పాల్గోంటే.. గంటకు 10 నుంచి 12 లక్షల వరకు డిమాండ్ చేస్తారట. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో.ఇక శ్రీలీల నటిస్తోన్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఈ భామకు మరో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. విషయంలోకి వస్తే.. శ్రీలీలకు ప్రభాస్ సరసన నటించే అవకాశం వచ్చిందని సమాచారం.

ప్రభాస్ ప్రస్తుతం కల్కీ అనే ఓ ఫాంటసీ, యాక్షన్ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. నాగ్ అశ్విన్ దర్శకుడు ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఓ లవ్ స్టోరీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించనున్నారట. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీగా వస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. అయితే ఈ సినిమాలో శ్రీలీలకు అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో ఓ ప్రకటన విడుదలకానుందని సమాచారం.. ఇక్కడ మరో రూమర్ ఏమంటే ఈ సినిమా కోసం శ్రీలీల ఓ ఇద్దరి హీరోల సినిమాలను వదులకుందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *