ఆ రోజుల్లో శ్రీకాంత్, ఊహ పెళ్లి ఎలా జరిగిందో మీరే చుడండి.

శ్రీకాంత్- ఊహ ప్రేమించి పెళ్లి చేసుకున్నారని అందరికీ తెలిసిందే. అయితే చాలా మందికి వారి ప్రేమ గురించి, ప్రేమ పెళ్లి గురించి తెలియకపోవచ్చు. చాలా సందర్భాల్లో వాళ్లే తమ లవ్ స్టోరీని చెప్పుకున్నారు. ‘ఆమె’ సినిమా షూటింగ్‌ సమయంలో శ్రీకాంత్‌- ఊహల మధ్య స్నేహం మొదలైంది. ఆ తర్వాత వాళ్లిద్దరూ కలిసి 4 సినిమాల్లో నటించారు. అప్పట్లో వారి మధ్య ప్రేమ ఉందని, వాళ్లు ప్రేమించుకుంటున్నారని ఎవరికీ తెలియదు.

అయితే శ్రీకాంత్.. ఊహ ఆమె అనే సినిమాలో నటించే సమయంలో ప్రేమలో పడ్డారు. తర్వాత 3 సినిమాలలో నటించినా.. ఎక్కడ కూడా వీరు తమ ప్రేమను బయట పెట్టలేదు. కానీ ఊహ తల్లిదండ్రులు అప్పటికే ఊహకి పెళ్లి సంబంధాలు చూస్తూ పెళ్లి చేయాలని చూడగా శ్రీకాంత్ తో ఆమె పీకల్లోతు ప్రేమలో ఉంది. విషయం తెలుసుకున్న శ్రీకాంత్ ఊహ ఇంటికి నేరుగా వెళ్లి మీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అని చెబితే ఆమె తల్లిదండ్రులు అస్సలు ఒప్పుకోలేదట. ఇక సినీ ఇండస్ట్రీ నుండి మా అమ్మాయికి భర్తని తీసుకురావడం మాకు ఇష్టం లేదని చెప్పారట.

దాంతో చాలా బాధపడ్డారు శ్రీకాంత్. కానీ విషయం తెలుసుకున్న చిరంజీవి ఎలాగైనా సరే శ్రీకాంత్ , ఊహాలకు పెళ్లి చేయాలని నిర్ణయించుకొని.. ఊహా పేరెంట్స్ తో మాట్లాడి శ్రీకాంత్ గురించి, ఆయన గొప్పతనం గురించి వారికి చెప్పారట. ఇక అలా వీరిద్దరి పెళ్లి చిరంజీవి వల్లే జరిగిందని సమాచారం. ఆ మధ్యకాలంలో శ్రీకాంత్ ఊహ విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వినిపించినా.. వాటిపై చాలా ఘాటుగా స్పందించి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు శ్రీకాంత్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *