శ్రీకాంత్ అయ్యంగార్‌ను ఆఫ్ స్క్రీన్ చూస్తున్నప్పుడే అర్థమయిపోతుంది.. ఈయన సమాజం వేసే ఉచ్చులో బ్రతకడానికి ఇష్టపడే వ్యక్తి కాదు అని, అంతే కాకుండా ఈయనతో 5 నిమిషాలు మాట్లాడితే ఆయన మనస్థత్వం ఏంటో తెలుస్తుంది అని. కానీ శ్రీకాంత్ పర్సనల్ లైఫ్ గురించి చాలా తక్కువమంది ప్రేక్షకులకు తెలుసు. ఆయన లైఫ్‌లో ఎంతో ట్రాజిడీ ఉన్నా..
అవన్నీ పట్టించుకోకుండా సిటీకి దూరంగా ఉన్న ఒక ఇల్లు తీసుకొని పెళ్లి, పిల్లలు, సంసారం అనే విషయాలకు దూరంగా, తన తమ్ముడితో కలిసి జీవిస్తున్నారు శ్రీకాంత్. ఆయన ఫ్యామిలీ గురించి అడగగా.. పెళ్లి, పిల్లలు అనే ప్రక్రియ తన వర్కవుట్ అవ్వలేదని ఓపెన్‌గా చెప్పేశారు. పిల్లలను దూరం పెట్టాలని తనకు లేదని కానీ వారు దూరం పెట్టేంత తప్పు తాను చేయలేదని చెప్పుకొచ్చారు శ్రీకాంత్. ‘‘దూరం పెట్టిన తర్వాత రెండుసార్లు, మూడుసార్లు లేదా 10 సార్లు అడుగుతాను, దాని తర్వాత దొబ్బేయ్ అంటాను. నా మనస్థత్వం అలాంటిది అని’’ అన్నారు.
మొదటి భార్యకు దూరమయిన తర్వాత రెండో పెళ్లి చేసుకున్నానని అది కూడా వర్కవుట్ అవ్వలేదని శ్రీకాంత్ తెలిపారు. పలుమార్లు బాధపడిన తర్వాత ఎవరైనా నిజాయితీగా ప్రేమ అందించడానికి వచ్చినా నమ్మకం కుదరడం లేదని అన్నారు. సినీ పరిశ్రమలో అలాంటి వారు తనకు ఎవరూ ఎదురుపడలేదని, అంతా చాలా ప్రొఫెషనల్‌గా ఉంటాం అని బయటపెట్టారు.