శిరీష్ భరద్వాజ్.. చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ ని 2007 ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్నేళ్లకు వీరిద్దరూ విడిపోయారు. ఈ జంటకు ఓ పాప నివ్రతి ఉంది. ఆ తర్వాత శిరీష్ రెండో పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే 2007లో శ్రీజ- శిరీష్ భరద్వాజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దలకు తెలియకుండా ఆర్య సమాజ్ లో జరిగిన ఈ వివాహం అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది.
అయితే వీరి కాపురం ఎక్కువ రోజులు నిలవలేదు. మనస్పర్థలు రావడంతో 2011లో వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. అదే సమయంలో అదనపు కట్నం కోసం శిరీష్ తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని శ్రీజ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. అప్పటికే వీరికి ఒక కుమార్తె కూడా పుట్టింది. శిరీష్ నుంచి విడిపోయిన తర్వాత శ్రీజ కళ్యాణ్ దేవ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
మరోవైపు శిరీష్ భరద్వాజ్ 2019లో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ విహనను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారు చెన్నైలోనే స్థిరపడ్డారు. ఆ మధ్యన బీజేపీలో చేరి క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించారు శిరీష్ భరద్వాజ్. అయితే గత కొంత కాలంగా శిరీష్ తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఊపిరితిత్తుల సమస్యతో ఆయన కొద్ది రోజుల క్రితమే చెన్నైలోని ఒక ఆస్పత్రిలో చేరారు.పరిస్థితి విషమించడంతో కొద్ది సేపటి క్రితమే శిరీష్ కన్నుమూశారు.