గత కొంత కాలంగా ఆయన ఊపితిత్తుల వ్యాధితో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించడంతో బుధవారం ఉదయం చనిపోయినట్లు సమాచారం. శిరీష్ మృతి గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే మెగా స్టార్ చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ ఈరోజు కన్ను మూశారు.
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శిరీష్ భరద్వాజ్ ని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఊపిరితిత్తులు పని చెయ్యని కారణంగా శిరీష్ భరద్వాజ్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. శిరీష్ భరద్వాజ్, మెగా స్టార్ చిరంజీవి రెండో కుమార్తె శ్రీజని 2007 సంవత్సరంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఆ తరువాత కొన్ని సంవత్సరాల తరువాత వీరిద్దరి మధ్య పొరపొచ్చలు రావటం 2014లో విడిపోవటం జరిగింది. వీరిద్దరికీ ఒక పాప కూడా పుట్టింది. తరువాత శిరీష్ భరద్వాజ్ ఇంకొక వివాహం చేసుకున్న సంగతి కూడా తెలిసిందే. శిరీష్ భరద్వాజ్ గురించి ఇంకా వివరాలు రావాల్సి వుంది. అయితే శిరీష్ భరద్వాజ్ గుండె పోటుతో మృతి చెందినట్టుగా శిరీష్ స్నేహితులు తన సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు.