శ్రీహరి మరణానికి ముందు చివరి 30 నిమిషాల్లో ఏం జరిగిందో బయట పెట్టిన డిస్కో శాంతి.

శ్రీహరి.. డూపు లేకుండా ఎంతటి క్లిష్టమైన యాక్షన్ సన్నివేశాలలో అయినా సరే ఈయన సునాయాసంగా పూర్తి చేయగలరు. అందుకే శ్రీహరి యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. మొదట విలన్ గా తన కెరీర్ ని మొదలు పెట్టిన శ్రీహరి ఆ తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలతోపాటు యాక్షన్ డ్రామా చిత్రాలను కూడా తెరకెక్కించి ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యారు. అయితే అటు సీరియస్ రోల్స్ లో, ఇటు కామెడీ రోల్స్ లో తన నటనతో మెప్పించిన వ్యక్తి శ్రీహరి అనే సంగతి తెలిసిందే.

తన సినీ కెరీర్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలలో శ్రీహరి నటించారు. స్టంట్ మాస్టర్ గా సినిమాల్లోకి వచ్చిన శ్రీహరి అంచెలంచెలుగా ఎదిగారు. ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న శ్రీహరికి పోలీస్ పాత్రలు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. అథ్లెట్ కావాలని అనుకున్న శ్రీహరి సినిమాలపై ఆసక్తితో ఆ కోరికను నెరవేర్చుకోలేదు. పలు సినిమాలలో హీరోగా నటించి ఆ సినిమాలతో కూడా శ్రీహరి విజయాలను సొంతం చేసుకున్నారు. ఎలాంటి పాత్ర ఇచ్చినా ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసే నటులలో శ్రీహరి ఒకరు. శ్రీహరికి డిస్కో శాంతితో వివాహం జరిగింది.

కొన్ని సంవత్సరాల క్రితం కాలేయ సంబంధిత వ్యాధితో బాధ పడుతూ శ్రీహరి మృతి చెందారు. డిస్కో శాంతి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కడుపులో నొప్పి వస్తోందని శ్రీహరి చెప్పారని ఆమె తెలిపారు. ముంబైలోని లీలావతి ఆస్పత్రికి శ్రీహరిని తీసుకెళ్లాలని నర్సు సెలైన్ బాటిల్ లో ఒక ఇంజక్షన్ చేయగా ఆ తర్వాత భర్త పరిస్థితి విషమంగా మారిందని ఆమె చెప్పుకొచ్చారు. శ్రీహరికి కడసారి మాట్లాడలేకపోయానని ఆమె తెలిపారు. బరువు తగ్గడానికి చేయించుకున్న చికిత్సల వల్ల శ్రీహరి చనిపోయారని సమాచారం. శ్రీహరి ఆస్తులను పెద్దగా కూడబెట్టుకోలేకపోయారని సమాచారం అందుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *