సామాన్యుడిగా మొదలై, అసామాన్యుడిగా నిలిచి, గెలిచిన నందమూరి తారకరామారావు జన్మదినం మే 28. మరో రెండేళ్లల్లో శతవసంతం సంపూర్ణం కానుంది. నవరసనటసార్వభౌముని కొలుచుకుందాం. తెలుగుపాలకుని తలచుకుందాం. ఆకర్షణకు మరోపేరు అన్నగారు. స్ఫురద్రూపం, వాచకం ఆయన ప్రత్యేకం. ప్రతి అక్షరం, ప్రతి అచ్చు అచ్చంగా, స్వచ్ఛంగా పలుకుతాయి, మనకు చేరుతాయి. ఆ కంచుకంఠంలో స్వరవిన్యాసం, నటవిన్యాసం ఏకకాలంలో ప్రస్ఫుటంగా ప్రకటితమవుతాయి. అయితే నందమూరి తారక రామారావు గారి కుటుంబంలోని వారి గురించి చాలా మందికి తెలియదు. ఆయనకు దాదాపు 12 మంది పిల్లలు ఉన్నారు.
హరికృష్ణ, బాలకృష్ణ తప్పితే మిగతా వారి గురించి అంతగా తెలియదు.అయితే చాలామందికి వారి గురించి తెలియకపోవచ్చు. ఇకపోతే నందమూరి తారక రామారావు గారి మొదటి కుమారుడు నందమూరి రామకృష్ణ చిన్నప్పుడే చనిపోయాడు.రెండవ కొడుకు జయకృష్ణ. మూడవ సంతానం అమ్మాయి ఆమే పురందరేశ్వరి. ఆ తర్వాత కొడుకు సంతానం నందమూరి సాయి కృష్ణ.ఆయన కూడా చనిపోయారు.ఆయన కూడా ప్రస్తుతం లేరు.ఇక నాలుగవ కుమారుడు నందమూరి హరికృష్ణ.ఆయన కూడా ఈ మధ్య కాలంలోనే స్వర్గస్తులైనారు ఆ విషయం అందరికీ తెలిసిందే. ఇక ఐదవ కుమారుడు నందమూరి మోహనకృష్ణ.
ఈయన హరిక్రిష్ణ చాలా క్లోజ్ గా ఉండేవారు. చిన్నప్పటి నుంచి కూడా వీరిద్దరూ అన్నదమ్ములలాగే కాకుండా మంచి స్నేహితులుగా కూడా ఉండేవారట.ఇంకో విషయం ఏమిటంటే తారకరత్న ఈయన కొడుకే. ప్రస్తుతం తారకరత్న, ఈయన మాట్లాడుకోవడం లేదు.ఎందుకంటే తారకరత్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆ పెళ్లి మోహనకృష్ణకు నచ్చలేదు. అందుకే వారిద్దరి మధ్య మాటలు లేవు.ఆ తర్వాత కుమారుడు నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. అందరికీ సుపరిచితమైన వ్యక్తే. ఇక ఏడవ కుమారుడు నందమూరి రామకృష్ణ జూనియర్. మొదటి కుమారుడి పేరు ఈయనకు పెట్టారన్నమాట.
అందుకే ఈయన పేరు చివర జూనియర్ అని పెట్టారు. ఆయన కూడా చాలా సినిమాలు తీశారు.ఎనిమిదవ కుమారుడు జయశంకర కృష్ణ. ఆ తర్వాత నారా భువనేశ్వరి గారు.ఇక ఆడ సంతానం పురంధరేశ్వరి ఇదివరకే చెప్పుకున్నాము. చంద్రబాబు నాయుడు గారి భార్య కూడా.ఇక మూడవ కూతురు గరికపాటి లోకేశ్వరి.ఈమె బయట ప్రపంచానికి అంతగా తెలియదు.ఇక నాలుగవ కుమార్తె ఉమా మహేశ్వరి ఈమె కూడా బయటి ప్రపంచానికి అంతగా పరిచయం లేరు.ఇప్పటివరకూ చెప్పిన ఈ ఎనిమిది మంది కొడుకుల్లో ఇద్దరు ఇప్పటికే చనిపోయారు.