సౌందర్య భర్త ఇప్పుడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడో చూస్తే తెలుసా ..?

తెలుగు వెండితెర మీద సావిత్రి తరువాత అదే స్థాయి ఇమేజ్‌ సొంతం చేసుకున్న నటి సౌందర్య. తెలుగు తో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ ఎన్నో అద్భుత చిత్రాల్లో నటించిన ఈ అందాల నటి అర్ధాంతరంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లింది. హీరోయిన్‌గా కెరీర్‌ పీక్స్‌లో ఉన్న సమయంలోనే రాజకీయ పార్టీకి ప్రచారం చేసేందుకు వెళుతూ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది. అయితే ఈ సమయంలో ఎంతో మందికి తను నటించిన సినిమాలు..వాటిలోని ఆమె పోషించిన అద్భుతమైన పాత్రలు కళ్ళముందు మెదలాడాయి.

సౌందర్య – వెంకటేశ్, సౌందర్య – చిరంజీవిలది హిట్ పెయిర్ అని చెప్పాలి. వీరితో కలిసి నటించిన సినిమాలన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. తెలుగులో బాలకృష్ణ దర్శకత్వంలో నర్తనశాల మొదలై ఆగిపోయింది. ఇదే ఆమె చివరి సినిమా. సినిమాలలో వరుసగా అవకాశాలు అందుకుంటూ సాగుతున్న సమయంలోనే బీజెపి పార్టీలో చేరారు. పార్టీ ప్రచారానికి హెలికాఫ్టర్‌లో బయలుదేరిన ఆమె ప్రమాదవశాత్తు మరణించారు. ఆమె సోదరుడు అమర్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైంది.

ఆ ప్రమాదంలో సౌందర్యతో పాటు తన అన్న కూడా మృతి చెందారు. ఆమె మరణించే సమయానికి పెళ్ళి కూడా అయింది. చిన్నప్పటి స్నేహితుడు, వరుసకి మేనమామ, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన రఘుని 2003లో పెళ్ళి చేసుకుంది. పెళ్ళైన సంవత్సరానికే ఆమె మరణించడంతో రఘు డిప్రషెషన్ లోకి వెళ్లాడు. అతను కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. 2011లో మళ్ళీ పెళ్ళి చేసుకున్న రఘు ప్రస్తుతం గోవాలో ఉంటున్నాడు. ఇక సౌందర్య ఎంతో ఇష్టపడి కొనుకున్న ఇల్లు ఇపుడు పాడుపడిన బంగళాలా మారిందని ఆ మధ్య వార్తలు వచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *