సోనియా అగర్వాల్ కష్టాలు తెలిస్తే .. గుండె తరుక్కుపోవాల్సిందే.

తెలుగులో ఆమె చేసింది తక్కువే చిత్రాలే అయినా మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు దక్కకపోవడంతో తమి, కన్నడి చిత్రాలపై దృష్టిపెట్టింది. అక్కడ మంచి విజయాలు అందుకుంది. అయితే సోనియా అగర్వాల్ టాలీవుడ్లో చేసింది కొన్ని సినిమాలే అయినా కుర్రకారులో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. 2004లో విడుదలైన ‘7/జీ బృందావనీ కాలనీ’ అప్పట్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ప్రముఖ నిర్మాత ఎంఎం రత్నం కుమారుడు రవికృష్ణ ఈ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

ఇందులో సోనియా అగర్వాల్ హీరోయిన్ నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ‘7/జీ బృందావన కాలనీ’ మూవీలోని పాటలు ఇప్పటికీ కూడా మెస్మరైజ్ చేస్తుంటాయి. ఈ మూవీ తర్వాత ఆమె తెలుగులో నటించకపోయినా తమిళంలో మాత్రం కొన్ని సినిమాల్లో నటించింది. అయితే స్టార్ హీరోయిన్ క్రేజ్ ఉండగానే సోనియా అగర్వాల్ తనకు ఇండస్ట్రీలో లైఫ్ ఇచ్చిన దర్శకుడు సెల్వ రాఘవన్ నే పెళ్లి చేసుకుంది. అయితే కొద్దిరోజుల్లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత సోనియా అగర్వాల్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినా ఆమె కోరుకున్న పాత్రలు మాత్రం రావడం లేదు. దీంతో ఆమె సైడ్ కారెక్టర్లలో నటిస్తోంది. ఇటీవలే ఆమెకు ఓ దర్శకుడు తల్లి పాత్ర ఆఫర్ చేయడంపై తెగ ఫీలవుతోంది.

తనపాటు కెరీర్ ప్రారంభించిన త్రిష.. నయనతారను కూడా ఇలా అడుగుతారా? అంటూ ప్రశ్నిస్తోంది. తాజాగా ఆమె బరువు తగ్గి.. ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. ఇందుకు సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. గుర్తుపట్టలేకుండా మారిపోయిన సోనియాను చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. బొద్దుగా ఉన్నప్పుడు అందంగా కన్పించిన సోనియా సన్నబడి ఆకర్షణ కోల్పోయిందనే టాక్ విన్పిస్తోంది. హీరోయిన్ పాత్రల కోసం సోనియా అగర్వాల్ పడుతున్న కష్టాలు చూసి ఆమె అభిమానులు మాత్రం బాధపడుతున్నారు. సోనియాకు మళ్లీ పూర్వ వైభవం రావాలని కోరుకుంటున్నారు. అభిమానుల కోరిక ఫలిస్తుందో లేదో వేచిచూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *