అమ్మకి స్పెషల్ గా వండిపెట్టిన రాహుల్ గాంధీ. దీంతో సోనియా గాంధీ ఏం అన్నదో చుడండి.

ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతాల్లో విజిబిలిటీ చాలా తక్కువగా ఉంది. దీని ప్రభావం ట్రాఫిక్‌పై ఎక్కువగా కనిపిస్తోంది. అయితే సోనియా, రాహుల్ గాంధీ తమ గార్డెన్‌లోని నారింజ పండ్లు తెంపడానికి బాస్కెట్‌తో వెళ్తూ కనిపిస్తారు. బుట్టలోకి తెచ్చిన పండ్లను కిచెన్‌లో క్లీన్ చేసి ఆరెంజ్ మార్మలాడ్ రెసిపీ తయారు చేయడానికి రెడీ అయ్యారు.

కిచెన్‌లో ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలో సోనియా తనకు భారతీయ వంటకాలు నేర్చుకోవడానికి చాలా సమయం పట్టిందని,ముఖ్యంగా కారం తినడానికి చాలా సమయం పట్టిందన్నారు. గతంలో ఎవరైనా భారతీయుడు విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి ఫుడ్‌కు అలవాటు పడలేరు.. అలాగే తాను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు భారతీయ ఫ్లేవర్స్‌కు ముఖ్యంగా మిర్చికి అలవాటు పడడానికి కొంత సమయం పట్టిందని ఆమె చెప్పారు. తాను ఎప్పుడు విదేశాలకు వెళ్లినా తిరిగి వచ్చిన వెంటనే ఆమె వండే వంటకం ఒకటి ఉందని..

అదే అర్హర్ కీ దాల్, చావల్ అని సోనియా అన్నారు. తర్వాత సంభాషణలో రాహుల్..బీజేపీ వాళ్లు ఈ జామ్ అడిగితే వాళ్లకి ఇద్దామా మమ్మీ? అని అడిగారు. అందుకు సోనియా ‘వాళ్లు మన మీద విసురుతారు అనగానే ఇద్దరు గట్టిగా నవ్వుకున్నారు. అది కూడా మంచిదే.. మనం దాన్ని తిరిగి తీసుకోవచ్చు అని రాహుల్ బదులు ఇస్తారు. ఇది నా సోదరి ప్రియాంక చేసే వంటకం, ఆమె దీన్ని మెరుగుపరిస్తే నేను దాన్ని ఫాలో మాత్రమే అవుతున్నాను అని రాహుల్ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *