దక్షిణ భారతదేశంలో తన ఉనికిని విస్తరించిన ఈ ముంబై ఫేమస్ ఫాబ్రిక్ బ్రాండ్ సౌత్ ఇండియా మొత్తం తన డిజైనర్ మార్కెట్‌ను విస్తరించనుంది. సరోజ్ ఫ్యాబ్రిక్స్ దేశవ్యాప్తంగా వివిధ పెద్ద ఫ్యాషన్ హౌస్‌లు, సెలబ్రిటీల ఫ్యాషన్ డిజైనర్లు, రన్‌వే షోలు మరియు ప్రతిష్టాత్మకమైన ఫ్యాషన్ వీక్‌లకు ఒక సొల్యూషన్‌గా పేరుగాంచింది. ఈ సందర్భంగా సరోజ్ ఫ్యాబ్రిక్స్ డైరెక్టర్ అశోక్ మోడీ మాట్లాడుతూ..
‘‘హైదరాబాద్‌కు అత్యుత్తమ ఫ్యాబ్రిక్స్ అనుభవాన్ని అందిస్తున్నందుకు సంతోషిస్తున్నామం. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ అతిపెద్ద ఫ్యాబ్రిక్స్ షోరూమ్ డిజైనర్లకు ఒక వరం అవుతుందని అన్నారు. పెళ్లి మరియు రోజువారీ ఫ్యాషన్ ఫ్యాబ్రిక్‌ల కోసం ఈ స్టోర్‌ను ప్రత్యేక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని,
దాదాపు 50 సంవత్సరాల నైపుణ్యంతో, సరోజ్ ఫ్యాబ్రిక్స్ ప్రజలకు అవసరమైన అన్ని శుభకార్యాలతో పాటు, ఫ్యాషన్ డిజైనర్లు, సినిమాలు, సీరియల్స్, ఎగుమతిదారులు, బోటిక్ యజమానులు, ఫ్యాషన్ పరిశ్రమకు అత్యుత్తమ నాణ్యత గల బట్టలను సరఫరా చేయడం ద్వారా నమ్మకాన్ని సంపాదించుకుందని స్పష్టం చేశారు.