విడాకులు తర్వాత.. సమంత, నాగచైతన్య ఏం చేసినా.. హాట్ టాపిక్’గా మారుతుంది. సోషల్ మీడియాలో ఏ పోస్టు పెట్టిన కూడా దాన్ని వెంటనే వైరల్ చేస్తున్నారు జనం. దీంతో వీరికి సంబంధించిన ఏ వార్త అయిన చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు చైతు డైటింగ్ వార్తలు టాలీవుడ్‌లో మరింత హాట్ హాట్ చర్చకు దారి తీశాయి, తాజాగా నేడు ఓ ఫొటో వైరల్ గా మారింది. నాగ చైతన్య కొన్ని రోజుల క్రితం హోటల్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ చెఫ్ నాగ చైతన్యతో కలిసి ఫొటో దిగి తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ఆ ఫొటోలో వెనకాల శోభిత ధూళిపాళ కూర్చొని ఉంది. ఈ ఫొటో పెట్టి నెల రోజుల పైనే అవుతున్నా సడెన్ గా ఇప్పుడు వైరల్ గా మారింది. మొదట్లో ఈ ఫోటోని అంతగా గమనించకపోవడంతో ఇందులో శోభిత కనపడలేదు అనుకుంట. కానీ నెటిజన్లు కొంతమంది ఈ ఫోటోని ఇప్పుడు షేర్ చేసి ఇందులో శోభిత ఉంది, చైతు శోభిత కలిసి ఎక్కడికో వెళ్లారు, ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందని పోస్టులు చేస్తున్నారు.
దీంతో మరోసారి నాగ చైతన్య, శోభిత వైరల్ గా మారారు. ఇక ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో ఎలాంటి రూమర్స్ వచ్చినా నాగ చైతన్య స్పందించలేదు. అయితే ఈ ఫొటోతో చైతు, శోభిత ఇద్దరి మధ్య నిజంగానే ఏదో ఉందా అని వైరల్ అయింది. మరి దీనిపై అయినా చైతు స్పందిస్తాడో లేదో చూడాలి. శోభిత ఏమైనా స్పందిస్తుందా లేక నిజంగానే వాళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారా తెలియాలి.