అప్పట్లో శోభన్ బాబు చనిపోయినపుడుచిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోలు కూడా మా ఇంట్లో ఎంతో మంది హీరోలున్న మా ఇంటి ఆడవాళ్లకు హీరోగా శోభన్ బాబు సినిమాలు అంటేనే ఇష్టం అని చెప్పడం గమనార్హం. అయితే శోభన్ బాబు అంటే ఒక హీరో మాత్రమే కాదు ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారుడు కూడా.. 2008 మార్చి 20వ తేదీన అశేష అభిమానులను శోకసంద్రంలో ముంచి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా శోభన్ బాబు మరణించే చివరి క్షణంలో ఏం జరిగింది అన్న విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
ఇకపోతే మార్చి 20వ తారీఖున ఏం జరిగింది అంటే శోభన్ బాబు ఒక్కగానొక్క కొడుకు కరుణ శేషుతో ఉదయం చాలాసేపు మాట్లాడారట. మద్రాస్ లో ఆయనకున్న స్థలంలో ఒక పెద్ద బిల్డింగ్ కూడా నిర్మిస్తున్నారు. ఆ బిల్డింగులో ఫ్లోరింగ్ కు ఎలాంటి టైల్స్ వాడితే బాగుంటుంది? ఎక్కడినుంచి తెప్పించాలి ?అన్న అంశాలపై కూడా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చర్చించుకున్నారట. అయితే ఈ విషయంపై పూర్తి నిర్ణయానికి వచ్చిన తర్వాత కరుణ శేషు కారు తీసుకుని బయటకు వెళ్లిపోయారు. కొడుకు ఇంటి నుంచి బయటకు వెళ్ళగానే భార్యతో మజ్జిగ తీసుకురా అని చెప్పి తనకు ఎంతో ఇష్టమైన రాకింగ్ చెయిర్ లో కూర్చున్నారట.
న్యూస్ చూడడానికి టీవీ ఆన్ చేసి.. ఎంతసేపటికి మజ్జిగ భార్య తేవకపోవడంతో భార్య వద్దకే వెళ్లాలనుకున్నారు. అలా కుర్చీలోంచి పైకి లేచిన ఆయన ఒక్కసారిగా సివియర్ హార్ట్ ఎటాక్ వచ్చి బోర్ల పడిపోయారట. దాంతో ముక్కుకి కూడా దెబ్బ తగిలింది. ఇక అక్కడికక్కడే మరణించారు. భార్య బయటకు వచ్చి చూస్తే అక్కడికక్కడే ఆయన కుప్పకూలిపోయారు వెంటనే ఈ విషయాన్ని కొడుకు కరుణ శేషుకి ఇతర కుటుంబ సభ్యులకి తెలియజేశారట.. కొడుకు తిరిగి వచ్చేసరికి ఆయన మరణించినట్లు సమాచారం. ఇక జీవితంలో ఎన్నో చూడాల్సిన శోభన్ బాబు అలా 71 సంవత్సరాలకే అర్ధాంతరంగా గుండెపోటు కారణంగా జీవితాన్ని చాలించేశారు.