బుల్లితెర పై శోభన్ బాబు నటించిన అలనాటి సినిమాలు ప్రసారం అయితే ఇప్పటికీ బుల్లితెర ప్రేక్షకులు ఆసినిమాలను చూస్తూనే ఉంటారు. ఇటువంటి పరిస్థుతుల నేపధ్యంలో అలనాటి అందాల నటుడు శోభన్ బాబు ఇమేజ్ కి కొందరు క్రేజీ స్టార్స్ అపఖ్యాతికి గురి చేసారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మొన్న భాగ్యనగరంలో ‘శోభన్ బాబు సేవాసమితి’ తరపున కొంతమంది ఫిలిం సెలెబ్రెటీలకు అవార్డులు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేసారు. అయితే దాదాపు 220 సినిమాలలో నటించిన శోభన్ బాబు చెన్నైలో 2008 సంవత్సరం మార్చి నెల 20వ తేదీన మృతి చెందాడు.నిన్నటికి శోభన్ బాబు మరణించి 13 సంవత్సరాలు కాగా శోభన్ బాబు ఆహార నియమాలను కచ్చితంగా పాటించేవారు.శోభన్ బాబు చనిపోవడానికి కొన్ని గంటల ముందు ఆయన తన కొడుకు కరుణ శేషుతో చెన్నైలో నిర్మిస్తున్న భవంతికి సంబంధించిన కీలక విషయాలను మాట్లాడారు.
ఆ భవంతిలో వేయాల్సిన టైల్స్ గురించి చర్చ జరిగిన తరువాత శోభన్ బాబు భార్యకు మజ్జిగ తీసుకురావాలని చెప్పి వార్తలు చూడటం కోసం టెలివిజన్ ను ఆన్ చేసి భార్య మజ్జిగ తీసుకురావడం ఆలస్యం కావడంతో కుర్చీలోంచి లేచి భార్య దగ్గరకు వెళ్లాలని అనుకున్నారు. కానీ ఆ సమయంలోనే హార్ట్ ఎటాక్ రావడంతో అక్కడికక్కడే కుప్పకూలి మరణించారు.అలా 71 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో శోభన్ బాబు మరణించారు.