అడవుల్లో ఉండే తెగల వారికి ఇలాంటి ఆచారాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అందులోనూ ఎక్కువగా పెండ్లిల విషయంలోనే చాలా చిత్ర విచిత్రమైన ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్నాయి. మనకు తెలిసినంత వరకు పెండ్లి అంటే ఒకరి కొకరు కడదాకా బతికే ఒక మంచి సాంప్రదాయం. అయితే కొన్ని ఆచారాలు వింతగా ఉంటాయి. ఎంత వింతగా అంటే అసలు ఇలాంటి ఆచారాలు కూడా ఉంటాయా అనిపిస్తుంది. ఎందుకంటే మనకు పెద్ద తప్పులుగా ఉండేవి కూడా కొంత మందికి ఆచారాలు గా ఉంటాయి. అయితే ఎవరి ఆచారాలు వారికి కాబట్టి మనం కూడా వాటిని తప్పు పట్టలేం.
ముఖ్యంగా పెళ్లిళ్ల సమయంలో ఎక్కువగా వింత ఆచారాలు కనిపిస్తుంటాయి. సాధారణంగా మనదేశంలో అయితే పెళ్లి తరవాత శోభనం ఉంటుంది. ఆ శోభనం సమయంలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు మాత్రమే గదిలో ఉండాలి. ఇక శోభనానికి అంతా సెట్ చేసిన తరవాత పెళ్లి కూతురు తరపున ఉండే వయసులో పెద్దవాళ్లు కొన్ని సలహాలు సూచనలు చేస్తారు. శోభనం గదిలో పెళ్లి కొడుకుతో ఎలా మెలగాలి అని చెప్పి అక్కడ నుండి వెళ్లి పోతారు. ఇక ఆ గది వైపుకు కూడా చూడరు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రాంతంలో ఉన్న ఆచారం గురించి వింటే మాత్రం షాక్ అవ్వాల్సిందే. ఇలాంటి ఆచారం ప్రపంచంలో మరెక్కడా ఉండదేమో అని అనుకోవాల్సిందే.
ఆ ఆచారం ఏంటంటే…పెళ్లి తరవాత శోభనం గదిలోకి పెళ్లి కూతురుతో పాటు ఆమె తల్లి కూడా వెళ్లాల్సిందేనట. అదేంటి పెళ్లి కూతురు తల్లి శోభనం గదిలోకి వెళ్లి ఏం చేస్తుంది అని అనుకుంటున్నారా…? పెళ్లి కొడుకు ఏ కోరిక కోరినా తీర్చాల్సిందేనట..కోరికలంటే కట్నాలు కానుకలే కాదు. ఏ కోరిక అయినా తీర్చాల్సిందేనట. చెప్పుకోవడానికి మనకు ఇబ్బందిగా ఉన్నా అది వాళ్ల ఆచారమే కాబట్టి పాటించక తప్పదు. ఇక ఈ ఆచారాన్ని ఆఫ్రికాదేశంలోని ఓ తెగ వాళ్లు పాటిస్తారు. ఒకవేళ అల్లుడి కోరిక తీర్చకపోతే అప్పుడే విడాకులు ఇచ్చే హక్కు అల్లుడికి కూడా ఉంటుందట. ఇక ఈ ఆచారాన్ని వ్యతిరేకించేవాళ్లు కూడా ఉన్నారు కానీ అక్కడి ప్రజలు మాత్రం ఆచారాల విషయం వెనక్కితగ్గేదేలే అని పాటిస్తున్నారట. మరి ఇలాంటి ఆచారాలకు ఎప్పుడు చెక్ పడుతుందో చూడాలి.