ఈసారి బిగ్‌బాస్ సీజన్ 7లోకి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ వచ్చారు. ఇందులో కొంతమంది అందరికి తెలిసిన వాళ్ళు ఉండగా కొంతమంది మాత్రం సోషల్ మీడియాలో మాత్రమే పాపులారిటీ తెచ్చుకున్న వాళ్ళని తీసుకొచ్చారు. బిగ్‌బాస్ సీజన్ 7లో ఎనిమిదవ కంటెస్టెంట్ గా సీరియల్ నటి, కార్తీకదీపం ఫేమ్ శోభా శెట్టి ఎంట్రీ ఇచ్చింది. అయితే గతంలో ఎన్నడూ చూడని విధంగా బిగ్ బాస్ ఏడో సీజన్‌ను ఉల్టా పుల్టా కాన్సెప్టుతో నడుపుతున్నారు.
ఇందులోకి మొత్తంగా 19 మంది కంటెస్టెంట్లు వచ్చారు. అందులో కొందరు మాత్రమే స్పెషల్‌గా ఫోకస్ అయ్యారు. వారిలో కార్తీక దీపం ఫేం శోభా శెట్టి ఒకరు. ఈమె నాగార్జున వచ్చే ఎపిసోడ్లలో మంచిగా ఉంటూ.. హౌస్‌లో మాత్రం మోనితలా మారిపోతూ సంచలనంగా మారింది. బిగ్ బాస్ ద్వారా మరింత హైలైట్ అయిన శోభా శెట్టి.. ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్‌లో తన ప్రియుడిని పరిచయం చేసింది. అతడు ఎవరో కాదు.. కార్తీక దీపం సీరియల్‌లో నటించిన యశ్వంత్ రెడ్డి. హౌస్ లోపల శోభా శెట్టి ఎలా కష్టపడి ఆడుతుందో.. బయట ఆమెను ప్రమోట్ చేసి ఓట్లు వేయించడం కోసం యశ్వంత్ కూడా కష్టపడుతున్నాడు.

ఇలా చాలా సపోర్టును అందిస్తున్నాడు. శోభా శెట్టి బిగ్ బాస్ ఫినాలేలో 14వ వారంలోనూ కొనసాగుతోంది. దీంతో ఆమెకు సపోర్టును అందించడం కోసం యశ్వంత్ రెడ్డి తాజాగా సోషల్ మీడియాలో లైవ్‌ను నిర్వహించాడు. ఇందులో తమ ప్రేమ కథతో పాటు బిగ్ బాస్‌లో శోభా శెట్టి వ్యవహరిస్తున్న తీరుపై అతడు మాట్లాడాడు. అలాగే, పెళ్లితో పాటు ఆమెను బిగ్ బాస్ సేఫ్ చేస్తున్నాడని వస్తున్న వార్తలపైన కూడా క్లారిటీ ఇచ్చాడు.