పాములు గుడ్లు కాదు పిల్లలు కూడా పెడతాయి. నమ్మట్లేదా..!ఈ వీడియో చూడాల్సిందే.

అవును, పాములు పిల్లలు పెట్టడం ఎప్పుడైనా చూశారా ? చాలామంది పాములు గుడ్లు పెట్టి వాటి ద్వారా పిల్లలు పెట్టడం చూసి ఉండొచ్చు కానీ పాము పిల్లలు పెట్టడం చూసి ఉండకపోవచ్చు. అలాంటి వారి కోసమే సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ స్నేక్ వీడియో. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన చాలా వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. ఈ వీడియోలు నెటిజన్లను చాలా వరకు భయాందోళనలకు గురిచేస్తున్నాయి.

అయితే ఇటీవలే ఓ పాముకు సంబంధించి వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అన్ని పాములు గుడ్లు పెట్టిన తర్వాత పిల్లలకు జన్మనిస్తాయి. అయితే తాజాగా ఎ పాము నేరుగా పిల్లలకే జన్మనిచ్చింది. అవును ఇది నిజం.. ఈ పాము గుడ్ల ద్వారా కాకుండా ఏకంగా మనిషిలాగే ప్రసవించే పద్దతిలో ఈ పాము తన పిల్లలకు జన్మనిచ్చింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

అన్ని పాములు గుడ్లు పెట్టిన తర్వాత పిల్లలను చేస్తాయి. ఇదే క్రమంలో ఆ గుడ్లను రక్షించేందుకు వాటి వద్దనే ఉంటూ.. ఆహారాలు కూడా తీసుకోవు. అయితే ఇలా పాములు పిల్లలకు జన్మనివ్వడం చాలా అరుదని నిపుణులు చెబుతున్నారు. పాములు డెలివరీ సమయంలో చాలా సెన్సిటీవ్‌గా ప్రవర్తిస్తాయని వారు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియోకు నెట్టింట విశేష స్పందన లభిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *