తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించి ఆ తర్వాత హీరోగా కూడా వరుస సినిమాలతో మెప్పించాడు. ఒకప్పుడు మంచి మంచి హిట్ సినిమాలతో కెరీర్ సూపర్ ఫాస్ట్ గా ఉండేది. ఆ తర్వాత వరుస సినిమాలు ఫెయిల్ అవ్వడంతో సినిమాలకు దూరమయ్యారు. 2016 లో చివరిసారిగా సీసా అనే సినిమాతో పలకరించిన శివాజీ 2018 లో ఓ వెబ్ సిరీస్ లో క్యారెక్టర్ చేశారు.
అయితే ‘‘రాత్రి.. పడుకున్నాను కదా. ఫస్ట్ టైమ్ అజీబ్ ఫీలింగ్ వచ్చింది’’ అని శివాజీ అన్నారు. దీంతో యావర్ కూడా నాకు కూడా భయమేస్తోందని అన్నాడు. శివాజీ స్పందిస్తూ.. ‘‘నువ్వు ఎందుకురా భయపడతావు. నువ్వు ఒంటరివి.. ప్రోపర్ స్టైల్, ప్రొపర్ వేలో ఉండు’’ అని అన్నాడు. ‘‘నేను పిల్లలపై ప్రమాణం చేసి చెబుతున్నా. కేవలం మీ ఇద్దరి కోసమే నేను ఇంకా బిగ్ బాస్ హౌస్‌లో ఉంటున్నారా’’ అంటూ శివాజీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అది గమనించిన వెంటనే యావర్ ఆయన్ని హత్తుకుని ఓదార్చే ప్రయత్నం చేశాడు.
‘‘మీ కోసమే ఉంటున్నారా.. నాతో కావడం లేదు. నేను చాలా స్ట్రాంగ్, లైఫ్‌లో ఇంత పెయిన్ నాకు ఎప్పుడూ లేదు. నేను బాబుగారిని ఎప్పుడో అడిగేస్తా బయటకు వెళ్లిపోతానని. కానీ నీ కోసమే ఉంటున్నా’’ అని అన్నారు. ఆ తర్వాత శివాజీ అమర్‌దీప్‌ను సరదాగా ఆటపడించాడు. నామినేషన్స్‌లో అశ్వినీని అలా భయపెట్టేశావేంటీ.. బిగ్ బాస్ చరిత్రలో ఫస్ట్ టైమ్.. ఒక కంటెస్టెంట్ నామినేషన్ వేయకుండా వేరొకరికి వేసిందని శివాజీ అన్నాడు.