ఫోక్ సాంగ్ పాడాలంటే ఖచ్చితంగా సింగర్ మంగ్లీనే అంటూ ప్రతి ఒక్కరిని ఆమె అద్భుతమైన గానంతో అందరిని అట్రాక్ట్ చేస్తుంది. అలాంటి మంగ్లీ కేవలం పాటలు పాడటమే కాకుండా కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటిస్తుంది. నితిన్ హీరోగా వచ్చిన మ్యాస్ట్రో సినిమాలో నెగటివ్ పాత్రలో నటించి అదరగొట్టింది. అయితే లంబాడి సామాజిక వర్గానికి చెందిన గాయని మంగ్లీ అసలు పేరు సత్యవతి రాథోడ్.
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి కర్ణాటక మ్యూజిక్ లో డిప్లమా పూర్తి చేశారు. ఆ తర్వాత యాంకర్ గా తన కెరీర్ ప్రారంభించారు. మ్యూజిక్ పై ఆసక్తి ఉండడంతో సింగర్ గా మారారు. జానపద గాయనిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తొలుత ప్రైవేట్ ఆల్బమ్స్ చేశారు. అవన్నీ ఆమెకు మంచి పేరును తీసుకొచ్చాయి తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా ఆల్బమ్స్ రూపొందించారు. అలాగే పండుగల సమయాలలో మంగ్లీ పాడిన పాటలు గ్రామ గ్రామాన వినిపిస్తుంటాయి.
ఈ ఆల్బమ్స్ ఆమెను వెండితెరకు పరిచయం చేశాయి. ప్లే బ్యాక్ సింగర్ గా స్థిరపడ్డారు. అయితే తాజాగా మంగ్లి త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె పెళ్లి చేసుకోబోయేది తమ బంధువుల అబ్బాయిని అని తెలుస్తుంది. వరుసకు బావ అయ్యే వ్యక్తిని సింగర్ మంగ్లీ పెళ్లి చేసుకోబోతుందట . ఈ ఏడాది డిసెంబర్ నాటికి పెళ్లి పీటలు ఎక్కవచ్చనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం సైన్ చేసిన ప్రాజెక్ట్ అన్ని పూర్తి చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటారని చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించిన వివరాలను పూర్తిగా వెల్లడించాల్సి ఉంటుంది. ఎలాగో ఇది పెళ్లి వయసే కాబట్టి మంగ్లీ కచ్చితంగా పెళ్లి చేసుకుంటుంది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.