సినీ ఇండస్ట్రీలో ఎంత పేరును సంపాదించిందో, అంత దారుణంగా ఆమె జీవితం పతనమైంది. చివరికి ఆమె చనిపోయాక బాడీ పై ఈగలు వాలి దారుణమైన పరిస్థితుల్లో మరణించింది. అయితే ఇక స్మిత్ చనిపోయాక ఆమెను మోసం చేసిన వాళ్ల పేర్లు కొన్ని బయటకు వచ్చాయి. ఆమె చనిపోయేముందు రాసిన లెటర్‌లో కూడా నా చుట్టూ ఉన్న వాళ్లు నాకు మనశ్శాంతి లేకుండా చేశారంటూ ఆ లెటర్‌లో తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం చేసింది.
అయితే బాబు మాత్రం ( చివర్లో ఆమె అనుపానులు చూసుకున్న వ్యక్తి) చాలా మంచివాడు అని.. నా కూడు ఎప్పుడూ తినేందుకు ఇష్టపడలేదు అని.. జీవితంలో అందరిలాగానే నాకు చాలా కోరికలు ఉన్నాయి.. బాబు తప్పితే అందరూ నా కష్టం తిని.. విశ్వాస ఘాతకులు అయ్యారని ఆమె బాధపడింది. ఇక ఆమె చనిపోయే ముందు రోజు రాత్రి కొంతమందికి ఫోన్ చేసి ఆందోళనతోనే మాట్లాడింది అట. అయితే ఆమె ఆత్మహత్య చేసుకుని ఈ లోకాన్ని విడిచి వెళ్లుతుందని మాత్రం ఎవ్వరూ ఊహించనే లేదు.
కన్నడ నటుడు రవిచంద్రన్, తెలుగు నటి అనూరాధ లాంటి వాళ్లు ఆమె చనిపోయాక ఆమె ముందు రోజు రాత్రే తమకు ఫోన్ చేసిందని తర్వాత చెప్పారు. అయితే ఆమె మాటల్లో ఆందోళన ఉన్నా ఇంత ప్రమాదాన్ని మాత్రం పసిగట్టలేదు. ఇక యాక్షన్ కింగ్ అర్జున్‌తో ఆమె ఓ సినిమాలో నటిస్తున్నప్పుడు చివరి రోజు షూటింగ్‌లో తాను త్వరలో చనిపోతానని.. అప్పుడు నన్ను చూడడానికి వస్తావా ? అనడంతో అర్జున్ చీ అదేం మాట అని తేలికగా కొట్టి పడేశాడే తప్పా ఆమె నిజంగానే అన్నంత పని చేస్తుందన్నది ఊహించనే లేదు. సిల్క్ చనిపోయిన రోజు ముందు స్టార్స్ ఎవ్వరూ రాకపోయినా అతడే ఆమె పార్థీవదేహం దగ్గరకు వచ్చి ఆమె తనతో అన్న మాటలు గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు.